తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కొమురం భీంగా ఎన్టీఆర్ కనిపించేది ఆరోజే..! - ntr

'ఆర్​ఆర్​ఆర్' చిత్రంలో ఎన్టీఆర్ ఫస్ట్​లుక్​ను కొమురం భీం జయంతి అయిన అక్టోబరు 2న విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతం ఆఫ్రికాకు పయనమవుతోంది చిత్ర బృందం. మూడు వారాలు పాటు అక్కడే షూటింగ్ జరుపుకోనుంది.

ఆర్​ఆర్​ఆర్​

By

Published : Aug 26, 2019, 8:46 AM IST

Updated : Sep 28, 2019, 7:13 AM IST

జూనియర్ ఎన్టీఆర్, రామ్​చరణ్ కలిసి నటిస్తోన్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై జాతీయ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే 25 శాతం షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రంలో ఓ ఆసక్తికర వార్త బయటకొచ్చింది. ఎన్టీఆర్ లుక్​ను మొదట విడుదల చేయాలనుకుంటుందట చిత్రబృందం. అక్టోబరు 22న కొమురం భీం జయంతి సందర్భంగా తారక్ ఫస్ట్​లుక్​ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారట.

జూనియర్ ఎన్టీఆర్​

ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్​చరణ్ నటిస్తుండగా.. కొమురం భీం పాత్రను జూనియర్ ఎన్టీఆర్ పోషిస్తున్నాడు. ఆలియా భట్ రామ్​చరణ్​కు జోడిగా కనిపించనుంది. తారక్ పక్కన ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు.

'ఆర్​ఆర్ఆర్' చిత్రబృందం కొన్ని కీలక పోరాట ఘట్టాలను తెరకెక్కించేందుకు ఆఫ్రికా పయనమవుతోంది. దాదాపు మూడు వారాల పాటు అక్కడే షూటింగ్ జరుపుకోనుందని సమాచారం. వచ్చే ఏడాది జులై 30న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇది చదవండి: మహేశ్​ కోసం 'కొండారెడ్డి బురుజు' మరోసారి..!

Last Updated : Sep 28, 2019, 7:13 AM IST

ABOUT THE AUTHOR

...view details