తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వెండి తెరపైకి లాలూ ప్రసాద్... 'లాల్​టెన్​' సినిమాతో రాక - lalu prasad

దేశ రాజకీయాలపై విలక్షణ ముద్రవేసిన నేత.. బిహార్​ రాష్ట్రీయ జనతా దళ్ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్. ప్రస్తుతం పశుదాణా కుంభకోణంలో జైలుశిక్ష అనుభవిస్తున్న లాలూ జీవితంపై ఓ సినిమా రాబోతోంది. లాల్​టెన్ అనే పేరుతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో భోజ్​పురీ నటుడు యశ్​ కుమార్.. లాలూ ప్రసాద్​గా కనిపించనున్నారు.

వెండితెరపై లాలూ జీవితం.. 'లాల్​టెన్​'

By

Published : Oct 30, 2019, 5:02 PM IST

రాష్ట్రీయ జనతా దళ్ అధినేత అంటే ఎవరికీ గుర్తురారేమో కానీ.. లాలూ ప్రసాద్ యాదవ్ అంటే మాత్రం ఓ నిండైన ఆహార్యం కళ్లముందు మెదులుతుంది. తెల్లని జుట్టు.. రంగు లాల్చీ.. మెడమీదుగా వెళ్లి కళ్లజోడుకు భద్రత కల్పించే తాడు.. జనంపై చెరగని ముద్ర.. విలక్షణ వ్యక్తిత్వం.. ఇవన్నీ లాలూ ట్రేడ్​మార్కులు.

ప్రస్తుతం పశుదాణా కుంభకోణం కేసులో శిక్ష అనుభవిస్తున్న లాలూ జీవితంపై ఓ సినిమా రాబోతోంది. భోజ్​పురి నటుడు యశ్​ కుమార్.. లాలూగా నటిస్తున్నారు.

లాల్​టెన్(లాంతరు) అనే పేరుతో సినిమాను తెరకెక్కిస్తున్నామని యశ్​ కుమార్ వెల్లడించారు. నటి స్మృతి సిన్హా.. లాలూ ప్రసాద్ సతీమణి, బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి పాత్ర పోషిస్తున్నారు. బిహార్, గుజరాత్​లోని పలు ప్రాంతాల్లో షూటింగ్ జరగనుంది. ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తోంది.

రాజకీయ నాయకుల జీవితాల ఆధారంగా సినిమా తీయడం.. చిత్ర రంగంలో ఇప్పుడొక ట్రెండ్​. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా 'పీఎం నరేంద్ర మోదీ', మన్మోహన్​సింగ్​పై 'ద యాక్సిడెంటల్​ ప్రైమ్​ మినిస్టర్​'తో పాటు అనేక చిత్రాలు విడుదలయ్యాయి.

ఇదీ చూడండి: 'మిర్చి' కేసులో నటి శిల్పాశెట్టి భర్తకు చిక్కులు

ABOUT THE AUTHOR

...view details