తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నోరా ఫతేహి కేశాలంకరణకు అంత ఖర్చా..!

వరుణ్ ధావన్, శ్రద్ధా కపూర్, నోరా ఫతేహి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'స్ట్రీట్ డ్యాన్సర్ 3డీ'. ఈ సినిమాలో నోరా కేశాలంకరణ కోసం భారీగా ఖర్చు చేసిందట చిత్రబృందం.

నోరా ఫతేహి
నోరా ఫతేహి

By

Published : Jan 24, 2020, 7:10 PM IST

Updated : Feb 18, 2020, 6:46 AM IST

సినిమాల్లో నటీనటుల లుక్​ కోసం ఎక్కడా రాజీ పడట్లేదు నిర్మాతలు. అందుకు ఓ ఉదాహరణే శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'స్ట్రీట్‌ డ్యాన్సర్‌ 3డీ' చిత్రం. ఈ సినిమాలో నోరా ఫతేహి కెనడియన్‌ డ్యాన్సర్‌గా ఒక ప్రత్యేకరకమైన కేశాలంకరణలో కనిపించి అలరించింది. ఇంతకీ ఆ కేశాలంకరణకు ఎంత ఖర్చయిందో తెలుసా? అక్షరాలా రూ.2.5 లక్షలట.

నోరా ఫతేహి

"ఈ చిత్రంలో శ్రద్ధాకపూర్‌, నేనూ పోటాపోటీగా డ్యాన్స్‌ చేసే ముఖ్యమైన సన్నివేశం ఒకటుంది. దీనిలో సరైన లుక్‌ రావడానికి నా పోనీటైల్‌ పొడవుగా, ఒత్తుగా ఉండాలని నేనూ, నా మేకప్‌ నిపుణుడు మార్సెలో అనుకున్నాం. ఈ చిత్ర షూటింగ్‌ దుబాయిలో జరుగుతున్నప్పుడు సరిగ్గా మేము కోరినట్టే కస్టమ్‌మేడ్‌ పోనీటైల్‌ను ఒక మేకప్‌ నిపుణుడు తయారు చేశారు. డ్యాన్స్‌ చేసేటప్పుడు నిజానికి ఆ పోనీటైల్‌ చాలా బరువుగా అనిపించేది. కానీ, సన్నివేశం పండటానికి నా లుక్‌ చాలా స్పెషల్‌గా ఉండాలి. అందుకే నేను దీనిని ఎంచుకున్నా."
-నోరా ఫతేహి, బాలీవుడ్ నటి

నృత్య ప్రధానంగా తెరకెక్కిన 'స్ట్రీట్‌ డ్యాన్సర్‌ 3డీ'లో 'గర్మీ' అనే గీతానికి నోరా ఫతేహి చేసిన స్టెప్పులు నిజంగానే తెరపై సెగలు పుట్టించాయి. రెమో డిసౌజా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నోరాతో పాటు వరుణ్‌ ధావన్‌, శ్రద్ధా కపూర్‌, ప్రభుదేవా ముఖ్య పాత్రల్లో నటించారు.

ఇవీ చూడండి.. హృతిక్‌ చేయలేకపోయిన ఛాలెంజింగ్‌ పాత్ర

Last Updated : Feb 18, 2020, 6:46 AM IST

ABOUT THE AUTHOR

...view details