తెలంగాణ

telangana

ETV Bharat / sitara

SarkaruVaariPaata: మహేష్ ఫ్యాన్స్​కు నిరాశ.. నో అప్​డేట్స్! - కృష్ణ బర్త్​డేన నో సర్​ప్రైజ్

సూపర్​స్టార్ కృష్ణ పుట్టినరోజైన మే 31న మహేష్ బాబు 'సర్కారు వారి పాట' నుంచి ఎటువంటి అప్​డేట్స్ రాబోవని ఆయన సోషల్ మీడియా టీమ్ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న కరోనా కష్టకాలంలో అప్​డేట్స్ సరికాదని మహేష్​ తెలిపినట్లు వెల్లడించింది.

Sarkaru Vaari Paata
సర్కారు వారి పాట

By

Published : May 27, 2021, 9:08 AM IST

సూపర్​స్టార్ మహేష్‌ బాబు (mahesh babu) సినిమాకు సంబంధించి ప్రస్తుతం ఎటువంటి అప్​డేట్స్ ఉండవని ఈ హీరో సోషల్ మీడియా బృందం స్పష్టం చేసింది. ప్రస్తుత కరోనా (Corona) పరిస్థితుల్లో అప్​డేట్స్​ సరికాదని ప్రిన్స్ నిర్ణయించారట. అందుకే ఆయన సినిమాకు సంబంధించిన ఎటువంటి అప్​డేట్స్ సూపర్​స్టార్ కృష్ణ పుట్టినరోజైన మే 31న రిలీజ్ అవ్వవని తెలుస్తోంది.

'సర్కారు వారి పాట' (Sarkaru vaari paata) చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తుండగా కీర్తి సురేశ్ హీరోయిన్​గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. దుబాయ్​లో ఇప్పటికే రెండు షెడ్యూల్​లు పూర్తి చేసుకుందీ మూవీ. అలాగే ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్​తో ఓ మూవీ చేయబోతున్నారు మహేష్. 'అతడు', 'ఖలేజా' తర్వాత వీరి కాంబోలో ఇది హ్యాట్రిక్​ చిత్రం కావడం వల్ల ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ABOUT THE AUTHOR

...view details