తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రామ్​తో తొలిసారిగా ఆ హీరోయిన్..!​ - అనుపమ

కథానాయకుడు రామ్ కొత్త చిత్రంలో నివేదా పేతురాజ్ హీరోయిన్​గా నటించనుందని సమాచారం. కిశోర్ తిరుమల ఈ సినిమాకు దర్శకుడు.

రామ్​తో తొలిసారిగా ఆ హీరోయిన్..!​

By

Published : Jul 5, 2019, 10:20 PM IST

హీరో రామ్ నటించిన 'ఇస్మార్ట్ శంకర్'కు గుమ్మడికాయ కొట్టేశారు. త్వరలో మరో చిత్రాన్ని ప్రారంభించనున్నాడీ కథానాయకుడు. కిశోర్​ తిరుమల దర్శకుడు. వీరిద్దరూ ఇంతకు ముందు 'నేను శైలజ', 'ఉన్నది ఒకటే జిందగీ' చిత్రాలకు కలిసి పనిచేశారు. ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. హీరోయిన్​గా నివేదా పేతురాజ్ కనిపించనుంది.

రామ్ పోతినేని- నివేదా పేతురాజ్

నివేదా.. కిషోర్‌ తిరుమల తెరకెక్కించిన ‘చిత్రలహరి’లో నటించింది. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘బ్రోచేవారెవరురా’ చిత్రంలోనూ సందడి చేసింది. ప్రస్తుతం అల్లు అర్జున్‌ సరసన నటిస్తోంది. రామ్‌ చిత్రంలో నివేదాతోపాటు, మరో ప్రముఖ కథానాయిక ఉంటుందని సమాచారం.

ఇది చదవండి: రోడ్డుపై సిగరెట్ తాగి.. ఫైన్ కట్టిన టాలీవుడ్ హీరో రామ్

ABOUT THE AUTHOR

...view details