"నాది చిన్నపిల్లల మనస్తత్వం. పిల్లలు కొత్తగా ఎక్కడికైనా వచ్చినా... ఎవరినైనా కలిసినా కొద్దిసేపు సైలెంట్‌గా ఉంటారు. కొంచెం అలవాటైతే ఇక అల్లరికి అంతే ఉండదు. నేనూ అంతే! ముందు కామ్‌గానే కన్పిస్తా.. తర్వాత ఎవరూ నన్ను ఆపలేరు.. అలా అందరిలో కలిసిపోతా" అని తన చొరవ గురించి వివరించింది నివేదా పేతురాజ్.
ఆ విషయంలో నన్ను అస్సలు ఆపలేరు: నివేదా - నివేదా పేతురాజ్ రామ్ రెడ్
ఒక్కసారి అలవాటైతే చొరవ విషయంలో తనను అస్సలు ఆపలేరని చెప్పింది హీరోయిన్ నివేదా పేతురాజ్. ప్రస్తుతం ఈమె రామ్ 'రెడ్' షూటింగ్లో పాల్గొంటుంది.
nivetha pethuraj
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ రామ్‌తో 'రెడ్' చిత్రంలో నటిస్తోంది. షూటింగ్ కోసం ఇటీవలే హైదరాబాద్ వచ్చింది. "సెట్‌లోకి వస్తూనే కొద్దిసేపు సైలెంట్‌గా ఉంటా... తర్వాత ఇక ఆగను. మనం ఎంతగా అందరితో కలిసిపోతామో... అంతగా సీన్‌లు బాగా వస్తాయి. ఆ ప్రభావం కచ్చితంగా మన నటనలో కనిపిస్తుంది" అని చెప్పింది పేతురాజ్.