తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'అంధుడిగా మారబోతున్న నితిన్'

టాలీవుడ్ యువ హీరో నితిన్ బాలీవుడ్​ రీమేక్​లో నటిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. గతేడాది విజయవంతమైన హిందీ చిత్రం 'అంధాధున్'​లో ఈ హీరో ప్రధానపాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.

By

Published : Sep 1, 2019, 10:34 AM IST

Updated : Sep 29, 2019, 1:24 AM IST

నితిన్

జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు చేసేస్తున్నాడు నితిన్‌. ప్రస్తుతం ఆయన చేతిలో 'భీష్మ'తో పాటు 'రంగ్‌దే' చిత్రాలు ఉన్నాయి. ఈ రెండూ శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్నాయి. ఓవైపు ఇవి సెట్స్‌పై ఉండగానే ముచ్చటగా మరో ప్రాజెక్టుకూ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశాడట నితిన్‌.

గతేడాది బాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచిన 'అంధాధున్‌' చిత్ర తెలుగు రీమేక్‌లో నితిన్ కథానాయకుడిగా నటించబోతున్నాడట. తాజాగా ఈ సినిమా రీమేక్‌ హక్కులను నితిన్‌ తండ్రి సుధాకర్‌ రెడ్డి దక్కించుకున్నట్లు సినీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఓ సరికొత్త క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో సాగే ఈ కథలో కథానాయకుడు ఓ అంధుడిగా కనిపిస్తాడు. ఈ పాత్రను మాతృకలో ఆయుష్మాన్‌ ఖురానా చేయగా.. ఇప్పుడు నితిన్‌కు ఆ అవకాశమొచ్చింది.

ఈ చిత్రాన్ని బాలీవుడ్‌ వెర్షన్‌ను తెరకెక్కించిన శ్రీరామ్‌ రాఘవన్‌తోనే రూపొందిస్తారా? లేక మరెవరైనా అనుభవమున్న దర్శకుడికి అప్పజెప్తారా? అన్నది వేచి చూడాలి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందట.

ఇవీ చూడండి.. ఫస్ట్​లుక్: 'వైకుంఠపురములో' బన్నీ స్టైల్​ అదుర్స్​

Last Updated : Sep 29, 2019, 1:24 AM IST

ABOUT THE AUTHOR

...view details