తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నితిన్ కొత్త సినిమా టైటిల్​ తెలుసా? - సురేశ్

యంగ్​ హీరో నితిన్​ జోరు పెంచాడు. వరుసగా చిత్రాలను పట్టాలెక్కిస్తున్నాడు. తాజాగా నితిన్‌ 29వ చిత్రానికి టైటిల్‌ ఖరారైంది. సినిమాకు ‘రంగ్‌దే’ అనే పేరును ఖరారు చేశారు. ‘గివ్‌ మీ సమ్‌ లవ్‌’ అనేది ఉపశీర్షిక.

నితిన్ కొత్త సినిమా టైటిల్​ తెలుసా?

By

Published : Jun 24, 2019, 12:23 PM IST

యువ కథానాయకుడు నితిన్ బిజిబిజీగా ఉన్నాడు. తన 29వ చిత్రానికి 'రంగ్​దే' అనే పేరు ఖరారైంది. ఈ మధ్య పాటల లిరిక్స్‌ను టైటిల్‌గా పెడుతున్న సినిమాలు ఎక్కువగానే వచ్చాయి. ముఖ్యంగా ​సినిమా పాటల్లోని లిరిక్స్​నే చిత్ర టైటిళ్లుగా వాడుతున్నాడు ఈ లవర్​బాయ్.

గతంలో నితిన్‌ నటించిన ‘గుండెజారి గల్లంతయ్యిందే’ (గబ్బర్‌ సింగ్‌లోని ‘దిల్‌ సే’ పాటలోని లిరిక్‌), ‘చిన్నదాన నీకోసం’ ( ‘ఇష్క్‌’ సినిమాలోని ‘చిన్నదాన నీకోసం’ లిరిక్‌). ఇప్పుడు నితిన్‌ నటించనున్న ‘రంగ్‌ దే’ కూడా ‘అ ఆ’ సినిమాలోని ‘రంగ్‌ దే రే..’ పాటలోని లిరిక్‌. 2020లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

'తొలిప్రేమ' చిత్రంతో మంచి విజయాన్ని అందుకొన్న వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. ఇందులో నితిన్‌కు జోడీగా కీర్తి సురేశ్‌ నటిస్తుంది.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నాగ వంశీ నిర్మిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ పీసీ శ్రీరామ్‌ ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించనున్నారు.

ఇదీ చూడండి: రకుల్​, ప్రియా వారియర్ మధ్యలో నితిన్!

ABOUT THE AUTHOR

...view details