తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆగస్టులో నితిన్​ కొత్త చిత్రం షురూ! - వక్కంతం వంశీ వార్తలు

'మ్యాస్ట్రో' సినిమాతో బిజీగా ఉన్న హీరో నితిన్​.. ఇప్పుడు మరో ప్రాజెక్టుకు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చారని సమాచారం. 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' చిత్రంతో డైరెక్టర్​గా మారిన రచయిత వక్కంతం వంశీ ఈ సినిమాను తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. ఆగస్టులో షూటింగ్​ ప్రారంభంకానున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Nithin new movie in the direction of Vakkantham Vamsi to starts from August
ఆగస్టులో పట్టాలెక్కనున్న నితిన్​ కొత్త చిత్రం!

By

Published : Jun 3, 2021, 3:01 PM IST

హీరో నితిన్‌ ఈ ఏడాదిలో 'చెక్‌', 'రంగ్‌ దే' వంటి చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించారు. ప్రస్తుతం ఆయన మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మ్యాస్ట్రో' సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమా సెట్స్‌పై ఉండగానే 'నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా' దర్శకుడు వక్కంతం వంశీతో ఓ సినిమా చేసేందుకు నితిన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని సమాచారం. ఈ చిత్రాన్ని ఠాగూర్‌ మధు నిర్మిస్తారని.. ఆగస్టులో సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని టాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది.

రొమాంటిక్‌, కామెడీ సన్నీవేశాలతో పాటు హై వోల్టేజ్‌ యాక్షన్‌ డ్రామా నేపథ్యంగా సినిమాను రూపొందించనున్నారట. ఇందులో నితిన్‌ పాత్ర ఓ ప్రత్యేకతను కలిగి ఉంటుందనే వార్తలొస్తున్నాయి. చిత్రంలో నటీనటులు సాంకేతిక సిబ్బంది ఎవరనేది ఇంకా తెలియదు. ప్రస్తుతం ఉన్న కొవిడ్​-19 రెండోదశ తగ్గగానే సినిమాకు సంబంధించిన ఇతర తారాగణాన్ని ఎంపిక చేయనున్నారని తెలుస్తోంది. నితిన్‌ ఇప్పటికే కృష్ణ చైతన్య దర్శకత్వంలో 'పవర్‌ పేట' అనే సినిమాకూ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

ఇదీ చూడండి:బిగ్​బీ పెళ్లిరోజు.. అరుదైన ఫొటో షేర్

ABOUT THE AUTHOR

...view details