తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వైరల్​: హృతిక్ పాటకు నితిన్ స్టెప్పులు..! - Hrithik Roshan nithin Dance

టాలీవుడ్ హీరో నితిన్ బాలీవుడ్ పాటకు డ్యాన్స్ చేశాడు. హృతిక్ నటించిన 'వార్' సినిమాలోని సాంగ్​కు నర్తించి.. ట్విట్టర్లో వీడియో షేర్ చేశాడు.

Nithin Dance On Hrithik Roshan Song
నితిన్ - హృతిక్ రోషన్

By

Published : Dec 26, 2019, 9:06 PM IST

బాలీవుడ్ హీరో హృతిక్క్​ రోషన్​కు ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. సగటు ప్రేక్షకుడే కాకుండా సినీ హీరో అయిన టైగర్​ ష్రాఫ్ లాంటి వారూ అతడిని అభిమానిస్తుంటారు. తాజాగా ఈ జాబితాలో టాలీవుడ్ కథానాయకుడు నితిన్ చేరిపోయాడు. హృతిక్ 'వార్' చిత్రంలోని పాటకు డ్యాన్స్ చేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు.

నితిన్ భీష్మ షూటింగ్​లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఇటలీ జరుగుతోంది. 'వార్' సినిమా కూడా అక్కడే షూటింగ్ జరిగింది. ఈ సందర్భంగా ఆ సినిమాలోని 'ఘుంగురూ టూట్​ గయా' అనే పాటకు డ్యాన్స్ చేశాడు. హీరోయిన్ రష్మిక మందణ్న కూడా ఈ సాంగ్​కు నర్తించడం విశేషం. ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేశాడు నితిన్.

"హృతిక్​ సర్​కు ప్రేమతో ఈ అభిమాని చిన్న గిఫ్ట్. ఇది ఫ్యాన్​ బాయ్ మూమెంట్. పాటకు డ్యాన్స్​ సింక్​ అవ్వకపోతే క్షమించండి" -నితిన్, టాలీవుడ్ హీరో.

భీష్మ సినిమాను వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నాడు. సితార ఎంటర్​టైన్మెంట్ బ్యానర్​పై సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

ఇదీ చదవండి: వాళ్లను చూస్తుంటే పెళ్లి చేసుకోవాలని అనిపిస్తోంది!

ABOUT THE AUTHOR

...view details