నితిన్ 'చెక్' సినిమాలోని 'నిన్ను చూడకుండా' లిరికల్ సాంగ్ విడుదలైంది. ఈ పాట శ్రోతలను ఆకట్టుకునేలా ఉంది. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. కల్యాణి మాలిక్ సంగీతమందించగా, చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించారు. వి.ఆనందప్రసాద్ నిర్మించారు. ఈ నెల 26 నుంచి థియేటర్లలో ప్రేక్షకులను అలరించనుంది.
నటుడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ నటించిన '101 జిల్లాల అందగాడు' సినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. ఈ ఏడాది మే 7న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. సాగర్ రాచకొండ దర్శకత్వం వహించారు. నిర్మాత దిల్రాజు సమర్పణలో రూపొందిందీ చిత్రం.
అల్లరినరేశ్ నటించిన 'నాంది' సినిమాలో 'దేవతలంతా' పాట విడుదల అయింది. ఈ పాట సినీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఈ నెల 19న విడుదల కానుందీ సినిమా.