తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నితిన్ 'అంధాధున్' రీమేక్ టైటిల్ ఖరారు - నితిన్​ మాస్ట్రో

మంగళవారం హీరో నితిన్​ పుట్టినరోజు సందర్భంగా.. ఆయన నటిస్తున్న 'అంధాదున్'​ తెలుగు రీమేక్​ చిత్ర టైటిల్​ను ప్రకటించింది చిత్రబృందం. దీంతో పాటు ఫస్ట్​లుక్​ను విడుదల చేసింది.

nithin
నితిన్​

By

Published : Mar 30, 2021, 6:58 AM IST

Updated : Mar 30, 2021, 7:22 AM IST

ఈ ఏడాదిలో ఇప్పటికే రెండు చిత్రాలతో సందడి చేశారు హీరో నితిన్‌. ఇప్పుడు ముచ్చటగా మూడో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పనిలో ఉన్నారు. ఆయన కథా నాయకుడిగా శ్రేష్ఠ్‌ మూవీస్‌ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. మేర్లపాక గాంధీ దర్శకుడు. సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మాతలు. నితిన్‌కు జోడీగా నభా నటేష్‌ నటిస్తోంది. తమన్నా ఓ ముఖ్య పాత్రను పోషిస్తోంది. మంగళవారం నితిన్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమాకు 'మాస్ట్రో' అనే పేరును ఖరారు చేస్తున్నట్టు ప్రకటిస్తూ.. ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.

నితిన్​

హిందీలో విజయవంతమైన 'అంధాధున్‌'కు రీమేక్‌గా రూపొందుతున్న చిత్రమిది. జూన్‌ 11న విడుదల చేయబోతున్నారు. ఇందులో నితిన్‌ అంధుడిగా కనిపించనున్నారు. ఫస్ట్‌ లుక్‌ ఆసక్తిని రేకెత్తించేలా ఉంది. "నితిన్‌ ఇదివరకెప్పుడూ చేయని ఓ విలక్షణ పాత్రను ఇందులో పోషిస్తున్నారు. పరిశ్రమ వర్గాలతోపాటు నితిన్‌ అభిమానులు ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 'భీష్మ' చిత్రానికి స్వరాలు సమకూర్చిన మహతి స్వరసాగర్‌ ఈ చిత్రానికి సుమధురమైన బాణీలు అందిస్తున్నారు. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా చిత్రం అలరిస్తుంది" అని చిత్రబృందం తెలిపింది.

ఇదీ చూడండి: 'జయం'తో వచ్చి.. అభిమానుల 'ఇష్క్​' గెలిచి!

Last Updated : Mar 30, 2021, 7:22 AM IST

ABOUT THE AUTHOR

...view details