నితిన్ హీరోగా, చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'చెక్'. వి.ఆనందప్రసాద్ నిర్మాత. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ కథానాయికలు. ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది.
చెక్ పెట్టేందుకు నితిన్ సై.. తోడుగా ఇద్దరు భామలు! - nithiin latest news
నితిన్ 'చెక్' సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. నవంబరు 5 వరకు ఈ షెడ్యూల్ సాగుతుందని నిర్మాత చెప్పారు.
చెక్ పెట్టేందుకు నితిన్.. తోడుగా ఇద్దరు భామలు!
"నటుడిగా నితిన్ స్థాయిని పెంచే చిత్రమిది. దర్శకుడు చంద్రశేఖర్ చదరంగం నేపథ్యంలో చాలా విభిన్నంగా ఈ చిత్రాన్ని తీస్తున్నారు. చిత్ర టైటిల్‌కు మంచి ఆదరణ దక్కింది. హైదరాబాద్‌లోనే షూటింగ్ కొనసాగుతోంది. నితిన్, రకుల్, సాయిచంద్, సంపత్ రాజ్ తదితరులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం. నవంబరు 5 వరకు ఈ షెడ్యూల్ కొనసాగుతుంది. దీంతో షూటింగ్ దాదాపుగా పూర్తవుతుంది" అని నిర్మాత వి.ఆనంద్ ప్రసాద్ అన్నారు.
Last Updated : Oct 18, 2020, 11:43 AM IST