హీరో నితిన్ మంచి దూకుడు మీద ఉన్నారు. ఇప్పటికే అతడు నటించిన రెండు సినిమాలు(చెక్, రంగ్ దే) విడుదలకు సిద్ధమవుతుండగా, మరో ప్రాజెక్టు రిలీజ్ డేట్‌ను శుక్రవారం ప్రకటించారు. #నితిన్30 పేరుతో తీస్తున్న ఈ చిత్రం.. జూన్ 11న థియేటర్లలోకి రానున్నట్లు వెల్లడించారు.
నితిన్ మూడు సినిమాలు.. రాబోయే ఆరు నెలల్లో విడుదల - చెక్ సినిమాలో నితిన్
యువ కథానాయకుడు నితిన్ చేస్తున్న మూడు సినిమాలు ఆరు నెలల వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వీటి విడుదల తేదీలు ఇప్పటికే ప్రకటించడం వల్ల అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.
నితిన్ మూడు సినిమాలు.. రాబోయే ఆరు నెలల్లో
'అంధాధున్' రీమేక్‌గా దీనిని తెరకెక్కిస్తున్నారు. ఇందులో నభా నటేశ్, తమన్నా ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. నితిన్ నటించిన 'చెక్'.. ఫిబ్రవరి 26న రానుండగా, 'రంగ్ దే' మార్చి 26న ప్రేక్షకుల్ని పలకరించనుంది.
ఇవీ చదవండి: