కరోనా లాక్‌డౌన్ పరిస్థితుల వల్ల రెండు నెలలుగా స్తంభించిన చిత్రసీమలో ఇప్పుడిప్పుడే సినీ సందడి మళ్లీ షురూ అవుతోంది. ఇప్పటికే ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్మాణాంతర కార్యక్రమాలు ప్రారంభం కాగా.. ఈనెలలోనే చిత్రీకరణలకు అనుమతులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే కొత్త సినిమాల సందడితో థియేటర్లు కళకళలాడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
థియేటర్లు తెరచుకుంటే తమ కొత్త చిత్రాలతో సందడి చేసేందుకు పలువురు దర్శక నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. అలా ముస్తాబై సిద్ధంగా ఉన్న సినిమాల జాబితాలో అనుష్క 'నిశ్శబ్దం' కూడా ఉంది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం.. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. తాజాగా ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కోసం ప్రత్యేకంగా ఓ షో కూడా వేశారని సమాచారం.