"అందాల నిధినే కాదు.. ఆదుకొనే మనసునూ" అంటోంది కథానాయిక నిధి అగర్వాల్. కొవిడ్ (COVID) రెండో వేవ్‌లో తను ఎంతో మందికి సాయం చేస్తోంది. ఆహారం, మందులు, వైద్యం.. అందేలా ఏర్పాట్లు చేస్తోంది. వీటిని ఇంత కాలం సోషల్‌మీడియా వేదికగా చేస్తూ వచ్చిన నిధి.. ప్రస్తుతం సొంతంగా ఒక వెబ్‌సైట్ రూపకల్పన చేయాలనుకుంటోంది. దీనిపై స్పందించిన ఆమె పలు విషయాలు పంచుకుంది.
Nidhi Agarwal: కరోనా బాధితుల కోసం వెబ్‌సైట్ - నిధి అగర్వాల్ డిస్ట్రిబ్యూట్ లవ్
కరోనా కష్టకాలంలో బాధితులకు అండగా నిలుస్తున్నారు పలువురు ప్రముఖులు. తాజాగా నటి నిధి అగర్వాల్ కూడా కొవిడ్‌తో ఇబ్బందిపడుతున్న వారికి సాయం అందించేందుకు ముందుకొచ్చింది. అందుకోసం ఓ వెబ్‌సైట్‌ను రూపొందిస్తున్నట్లు తెలిపింది.
"ఈసారి కొవిడ్‌తో ప్రతి రోజూ ఎవరో ఒకరు ఆత్మీయులను కోల్పోతూనే ఉన్నారు. ఇవన్నీ నన్ను కదిలించాయి. అందుకే వీరికి సాయం చేయడానికి కొంతమంది యువ సామాజిక కార్యకర్తలతో కలిసి ఒక వెబ్‌సైట్ రూపొందిస్తున్నాం. ఇన్‌స్టా (Instagram), ట్విట్టర్ (Twitter)లో కామెంట్ బాక్స్‌లో తమ సమస్యను వివరించేవారు బాధితులు. వారిని కనిపెట్టి, వారి చిరునామా కనుక్కొని సాయం చేయడం కష్టంగా ఉండేది. అందుకే వెబ్‌సైట్ అందుబాటులోకి తేవాలనుకున్నాం. అందులో సమస్యతో పాటు.. చిరునామా, ఫోన్‌నంబర్ తదితర వివరాలు నమోదు చేసే వెసులుబాటు ఉంటుంది. దీనివల్ల బాధితులకు సత్వర సాయం అందివ్వొచ్చు. ప్రస్తుతానికి దీన్ని కరోనా బాధితుల కోసమే తెస్తున్నాం" అని చెప్పుకొచ్చింది నిధి.
నిధి అగర్వాల్ తమిళంలో 'ఈశ్వరన్', 'భూమి' చిత్రాలు చేసింది. పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'హరిహర వీరమల్లు'(Harihara Veeramallu)లోనూ కీలకపాత్ర పోషిస్తోంది.