RRR movie: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మాగ్నమ్ ఒపస్ 'ఆర్ఆర్ఆర్' నుంచి కొత్త పాటకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. 'కొమురం భీముడో' అంటూ సాగే ఈ పాట డిసెంబర్ 24న విడుదలకానుంది. అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రం.. జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. అజయ్ దేవ్‌గణ్ కీలకపాత్ర పోషించారు. కీరవాణి సంగీతమందించారు. డీవీవీ దానయ్య రూ.450 కోట్లతో ఈ సినిమాను నిర్మించారు.
'ఆర్ఆర్ఆర్', 'శ్యామ్ సింగరాయ్' నుంచి అప్డేట్స్ - rrr trailer
RRR movie: రామ్‌చరణ్, ఎన్టీఆర్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం 'ఆర్ఆర్ఆర్' నుంచి 'కొమురం భీముడో' పాట ప్రోమో విడుదలై ఆకట్టుకుంటోంది. ఇక నాని నటించిన 'శ్యామ్ సింగరాయ్' నుంచి కూడా 'తార' అనే పాట విడుదలై అలరిస్తోంది.
rrr songs
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న 'శ్యామ్ సింగరాయ్' నుంచి 'తార' అనే పాట విడుదలైంది. ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యన్ దర్శకుడు. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ కథానాయికలు. ఈ సినిమా డిసెంబరు 24న విడుదలకానుంది.