తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కొత్త కాన్సెప్ట్​తో రాజశేఖర్​ కుమార్తె.. వింత కథతో పునర్నవి - శివానీ రాజశేఖర్

కొత్త సినిమా అప్​డేట్స్​ వచ్చేశాయి. హీరో రాజశేఖర్ కుమార్తె శివాని హీరోయిన్​గా అదిత్​ అరుణ్​తో చేస్తున్న 'డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు' సహా ​పునర్నవి నటిస్తున్న 'సైకిల్' చిత్ర వివరాలు ఇందులో ఉన్నాయి.

new movie updates
శివాని రాజశేఖర్ తొలి చిత్రం, పునర్నవి వింత కథ

By

Published : Jan 13, 2021, 7:40 AM IST

Updated : Jan 13, 2021, 11:48 AM IST

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.వి. గుహన్ దర్శకత్వంలో వస్తున్న రెండో చిత్రం 'డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు'. ఎవరు, ఎక్కడ, ఎందుకు...అనేది ఉపశీర్షిక. ఇందులో అదిత్‌ అరుణ్‌, శివాని రాజశేఖర్‌ జంటగా నటిస్తున్నారు. డా.రవి పి.రాజు దాట్ల నిర్మాత. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని హీరో రానా విడుదల చేశారు.

'డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు' ఫస్ట్​లుక్​ విడుదల చేస్తున్న రానా

"గుహన్‌ విభిన్నమైన ఆలోచనలున్న ఛాయాగ్రాహకుడు. ఆయనతో కలిసి పనిచేశా. తను దర్శకత్వం వహించిన ఈ సినిమా పోస్టర్‌ను చూస్తుంటే ఇదొక హై కాన్సెప్ట్‌ కథ అనిపిస్తోంది. గుహన్‌ ఇలాంటి మరెన్నో సినిమాల్ని తీయాలని కోరుకుంటున్నా."

- రానా దగ్గుబాటి, కథానాయకుడు

దర్శకుడు గుహన్​ మాట్లాడుతూ.. "తొలి సినిమా '118' తర్వాత, రెండో సినిమా గురించి ఆలోచిస్తున్నప్పుడు తట్టిన ఓ కొత్త కాన్సెప్ట్‌ ఇది. రానా చేతులమీదుగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదల కావడం ఆనందంగా ఉంది" అని అన్నారు.

వింత సంఘటనలతో..

'బిగ్​బాస్​' ఫేమ్ పునర్నవి భూపాలం, మహత్‌ రాఘవేంద్ర, శ్వేతావర్మ, సూర్య భరత్‌ చంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'సైకిల్‌. ఆట్ల అర్జున్‌రెడ్డి దర్శకుడు. పి.రాంప్రసాద్‌, వి.బాలాజీరాజు నిర్మాతలు. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 15న చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. "ఉత్తర భారతంలోని యదార్థమైన కొన్ని వింత సంఘటనల ఆధారంగా రూపొందించిన చిత్రమిది. తెలుగు రాష్ట్రాల్లో 75 తెరలపై మా సినిమా ప్రదర్శితం కాబోతోంది" దర్శకుడు చెప్పారు.

పునర్నవి, మహత్ రాఘవేంద్ర

ఇదీ చూడండి:నాకు నచ్చిందే దొరుకుతోంది: నభా నటేష్

Last Updated : Jan 13, 2021, 11:48 AM IST

ABOUT THE AUTHOR

...view details