తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సుశాంత్​ సింగ్​ను నేను అసలు కలవలేదు'

సుశాంత్ కేసు విచారణలో భాగంగా గోవాలోని హోటల్​ యాజమానికి ఈడీ సమన్లు జారీ చేసింది. తానెప్పుడూ సుశాంత్ కలవలేదని ఆయన విలేకర్లతో చెప్పారు.

Never met Sushant, but met Rhea in 2017: Goa hotelier Gaurav Arya
'సుశాంత్​ సింగ్​ను నేను అసలు కలవలేదు'

By

Published : Aug 30, 2020, 5:30 PM IST

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ మనీల్యాండరింగ్‌ కేసు దర్యాప్తులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ఈడీ) పలువురిని ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే గోవాలోని 'ట్యామరిండ్ అండ్‌ కేఫె కోటింగా' హోటల్‌ యజమాని గౌరవ్‌ ఆర్య, సోమవారం విచారణకు హాజరు కావాలంటూ సమన్లు జారీ చేసింది. సుశాంత్‌ను తానెప్పుడూ కలవలేదని గౌరవ్‌ విలేకర్లతో పేర్కొన్నారు.

విలేకర్లతో గౌరవ్ ఆర్య

'నాకు కేసుతో ఎలాంటి సంబంధం లేదు. నేనెప్పుడూ సుశాంత్‌సింగ్‌ను కలవలేదు. రియా చక్రవర్తిని 2017లో కలిశాను' అని గౌరవ్ తెలిపారు.

కేసు దర్యాప్తులో భాగంగా మాదకద్రవ్యాల వాడకం తెరపైకి వచ్చింది. డ్రగ్స్‌కు సంబంధించి రియా వాట్సాప్‌ చాట్‌లో గౌరవ్‌ ఆర్య ప్రస్తావన ఉంది. అతడే రియాకు మాదకద్రవ్యాలు సరఫరా చేసినట్లుగా అధికారులు భావిస్తున్నారు. గౌరవ్‌ ఆర్యపై నార్కోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ స్పైకోట్రోపిక్‌ సబ్‌స్టాన్సెస్‌ (ఎన్‌డీపీఎస్‌) 1985 చట్టం కింద కేసు నమోదు చేశారు. లాక్‌డౌక్‌ ప్రకటించినప్పటి నుంచి మూసి ఉన్న ఆ హోటల్‌ను సైతం ఈడీ అధికారులు పరిశీలించారు. రియా చక్రవర్తితోపాటు ఆమె సోదరుడు షోవిక్‌, రియా మేనేజర్‌ జయ సాహా, సుశాంత్‌ మాజీ మేనేజర్‌ శ్రుతి మోదీపై బుధవారం ఎన్‌డీపీఎస్‌ కేసు నమోదు చేశారు.

సుశాంత్‌సింగ్‌ మృతిపై సీబీఐ విచారణ కొనసాగుతోంది. రియా చక్రవర్తి మూడో రోజు దర్యాప్తు సంస్థ ఎదుట హాజరైంది. శుక్రవారం ఆమెను 10 గంటలపాటు విచారించిన సీబీఐ శనివారం 7 గంటలపాటు ప్రశ్నించింది. రియాతోపాటు ఆమె కుటుంబసభ్యులు, సుశాంత్‌ ఇంట్లో పనిచేసే పలువురిని అధికారులు ప్రశ్నిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details