తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బాయ్​కాట్ కరీనా కపూర్.. నెటిజన్ల ఆగ్రహం! - బాయ్​కాట్ కరీనా కపూర్

బాలీవుడ్ నటి కరీనా కపూర్​పై నెటిజన్లు మండిపడుతున్నారు. సీత పాత్ర చేసేందుకు ఎక్కువ రెమ్యునరేషన్ అడగటం పట్ల విమర్శలు కురిపిస్తున్నారు. దీంతో 'బాయ్​కాట్ కరీనాకపూర్'(BoycottKareenakapoor) అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్​లో ట్రెండింగ్​లో కొనసాగుతోంది.

kareena
కపూర్

By

Published : Jun 12, 2021, 8:26 PM IST

Updated : Jun 12, 2021, 8:37 PM IST

సీతా మాత కోణంలో రామాయణం చిత్రాన్ని తెరకెక్కించడానికి ప్రణాళికలు జరుగుతున్నాయి. ఈ సినిమాకు ప్రముఖ రచయిత 'బాహుబలి'(Bahubali) ఫేమ్ విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తున్నారు. అయితే ఈ చిత్రం సీత పాత్రలో కరీనా కపూర్​ను సంప్రదించిందట చిత్రబృందం. ఇందుకోసం కరీనా ఏకంగా రూ.12 కోట్ల రెమ్యునరేషన్​ను డిమాండ్ చేసిందట. దీంతో నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.

కారణమిదే?

సీత పాత్ర కోసం కరీనా అంతగా డిమాండ్ చేయడం సరికాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కొందరు సైఫ్​ అలీ ఖాన్​ను పెళ్లి చేసుకున్నాక కరీన మతం మారి ఇప్పుడు సీత పాత్రను చులకనగా చూస్తుందని మండిపడుతున్నారు. ఆమె సీత పాత్ర చేయాల్సిన అవసరం లేదంటూ చెబుతున్నారు. శూర్పనఖ పాత్రకు ఆమె సరిగా సరిపోతుందంటున్నారు. దీంతో 'బాయ్​కాట్ కరీనాకపూర్'(BoycottKareenakapoor) అనే హ్యాష్​ట్యాగ్ ట్విట్టర్​లో ట్రెండింగ్​లో నిలిచింది.

Last Updated : Jun 12, 2021, 8:37 PM IST

ABOUT THE AUTHOR

...view details