బాలీవుడ్ ప్రముఖ నటి నీనా గుప్తా(Neena Gupta).. తన ఆత్మకథను 'సచ్ కహున్ తో'(Sach Kahun Toh) పుస్తకాన్ని విడుదల చేసింది. అయితే ఇప్పుడా పుస్తకం చిత్రపరిశ్రమలో చర్చనీయాంశమైంది. అందులో తన వ్యక్తిగత జీవితంతో పాటు సినీ ప్రయాణం గురించి ఆమె పేర్కొంది. హీరోయిన్గా కెరీర్ ప్రారంభంలో కాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్న సందర్భాలను వివరించింది.
దక్షిణాదికి చెందిన ప్రముఖ నిర్మాత వల్ల తనకు కాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురైనట్లు నీనా గుప్తా పుస్తకంలో వెల్లడించింది. సినిమా ఛాన్సు కోసం తనతో ఓ రాత్రి గడపాలని అతడు కోరినట్లు పేర్కొంది.
"ముంబయికి వచ్చిన ఓ దక్షిణాది నిర్మాత నాతో ఓ ప్రాజెక్టు గురించి చర్చించేందుకు హోటల్‌కు రమ్మన్నాడు. హోటల్ లాబీ నుంచి అతడ్ని పిలిచినప్పుడు.. తన గదికి రమ్మని ఆహ్వానించాడు. కానీ, నేను వెళ్లలేదు. లాబీకి రావాలని అడిగాను. చివరికి మెట్ల మార్గంలో పైకి వెళ్లాను. దక్షిణాది చిత్రపరిశ్రమలో తాను పరిచయం చేసిన హీరోయిన్లు గురించి అతడు చెప్పాడు. తాను నిర్మించే కొత్త చిత్రంలో నాకు ఆఫర్ ఇస్తున్నట్లు తెలిపాడు. అయితే అందులో నా పాత్ర చిన్నదిగా అనిపించింది. దీంతో ఆ పాత్ర చేయనని చెప్పేశాను. అంతలోనే నేను అక్కడి నుంచి వెళ్తుండగా.. 'ఎక్కడికి వెళ్తున్నావు. ఈ రాత్రి ఇక్కడ ఉండడం లేదా?' అని అడిగాడు. ఆ మాటతో నా మతి స్తంభించింపోయింది. అంతలో ఆ నిర్మాత నా బ్యాగ్‌ను విసిరి.. 'బలవంతం చేసేది ఏమి లేదు. ఇక్కడి నుంచి వెళ్లిపోవచ్చు' అని అన్నాడు. దీంతో నా బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చేశాను"