తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'నీలి నీలి ఆకాశం' రికార్డు.. దక్షిణాది తొలి గీతంగా ఘనత

సంగీత ప్రియులను అలరిస్తున్న 'నీలి నీలి ఆకాశం' పాట.. యూట్యూబ్​లో సంచలన సృష్టించింది. సినిమా విడుదలకు ముందే సరికొత్త రికార్డును నమోదు చేసింది.

'నీలి నీలి ఆకాశం' రికార్డు.. తొలి గీతంగా ఘనత
నీలినీలి ఆకాశం పాట

By

Published : Aug 16, 2020, 12:30 PM IST

యాంకర్ ప్రదీప్ హీరోగా తొలిసారి నటిస్తున్న సినిమా '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?'. ఇప్పటికే విడుదల కావాల్సిన.. కరోనా ప్రభావంతో వాయిదా పడింది. అయితే అందులోని రొమాంటిక్ సాంగ్ 'నీలి నీలి ఆకాశం' మాత్రం రికార్డులు సృష్టిస్తోంది. చిత్రం విడుదలకు ముందే 200 మిలియన్ల వ్యూస్​ పొందిన తొలి దక్షిణాది గీతంగా ఘనత సాధించింది. ఈ విషయాన్ని చిత్రబృందం పంచుకుంది.

200 మిలియన్ వ్యూస్​ సాధించిన 'నీలి నీలి ఆకాశం' పాట

అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం.. వినసొంపుగా ఉండి, శ్రోతల మనసుల్ని మీటింది. అందుకే లాక్​డౌన్​లో పదేపదే ఈ పాటనే వినేలా చేసింది. ఈ సినిమాలో హీరోయిన్​గా అమృత అయ్యర్ నటిస్తోంది. మున్నా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఎస్​వీ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details