సుశాంత్ సింగ్ మృతితో సంబంధమున్న డ్రగ్స్ కేసులో ఎన్సీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. హీరోయిన్ దీపికా పదుకొణెను శనివారం ఐదుగంటలపాటు విచారించింది. ఆమె మేనేజర్ కరిష్మా ప్రకాశ్‌ను అధికారులు ప్రశ్నించినప్పుడు దీపికనూ ప్రశ్నించినట్లు సమచాారం. 'డీ' అక్షరంతో సాగిన వాట్సాప్ సంభాషణలపై విచారణ సాగినట్లు అధికారులు పేర్కొన్నారు. ఉదయం 9:50 గంటలకు ఎన్సీబీ కార్యాలయంలోకి వెళ్లిన దీపిక.. మధ్యాహ్నం 3:50 గంటలకు బయటకు వచ్చింది.
విచారణలో ఐదుగంటల పాటు దీపికా పదుకొణె - bollywood drug case ncb probe updates
స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణెను ఐదుగంటల పాటు ఎన్సీబీ విచారించింది. ప్రస్తుతం శ్రద్ధా, సారా ఆలీఖాన్లను అధికారులు ప్రశ్నిస్తున్నారు.
డ్రగ్ కేసు
దీపికను విచారించేటప్పుడు తను హాజరుకావచ్చా అని ఆమె భర్త, నటుడు రణ్వీర్ సింగ్ ఎన్సీబీని అడిగినట్లు వార్తలు వచ్చాయి. అలాంటి అభ్యర్థన ఏది తమ వద్దకు రాలేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం సారా ఆలీఖాన్, శ్రద్ధా కపూర్ల విచారణ సాగుతోంది.
Last Updated : Sep 26, 2020, 6:14 PM IST