నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే ప్రేక్షకుల్లో ఆసక్తి రెట్టింపవుతుంది. ఇప్పటికే వీరిద్దరు కలిసి పనిచేసిన 'సింహా', 'లెజెండ్' బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. తాజాగా ఈ జోడీ హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమైంది. బాలయ్య-బోయపాటిల మూడో సినిమా పూజా కార్యక్రమంతో నేడు ప్రారంభమైంది. వచ్చే ఏడాది నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.
కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టిన బాలయ్య ఇద్దరితో రొమాన్స్...
యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ మూడో చిత్రంలో ఇద్దరు కథానాయికలు ఉంటారని సమాచారం. వారిలో ఒక హీరోయిన్‌గా కన్నడ బ్యూటీ శ్రద్ధ శ్రీనాథ్ తీసుకునే ఆలోచనలో ఉన్నారట దర్శక నిర్మాతలు. ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రల్లో కనిపించనున్నాడని తెలుస్తోంది.
తమన్ సంగీతం...
ప్రస్తుతం తెలుగు సినిమాల్లో తమన్ హవా నడుస్తోంది. వరుస చిత్రాలతో జోరుమీదున్నాడు. తాజాగా బాలయ్య-బోయపాటి సినిమాకు సంగీతం అందించనున్నాడు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాత. నటీనటులు, సాంకేతిక విభాగం వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.
ప్రస్తుతం కె.ఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య హీరోగా తెరకెక్కిన 'రూలర్'... ఈనెల 20న విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను అత్యంత భారీ ఎత్తున నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది చిత్రబృందం. డిసెంబర్ 15న వైజాగ్‌లో ఈ వేడుక జరగనుంది.