తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రూ.10 కోట్ల పారితోషికం వదులుకున్న నయన్ - నయనతార పారితోషికం

దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకుంటోన్న హీరోయిన్లలో నయనతార ఒకరు. కోలీవుడ్​లో ఓ చిత్రంలో నటించేందుకు ఈమెకు రూ.10 కోట్లు ఆఫర్ చేయగా తిరస్కరించిందట. ఈ విషయం ఇప్పుడు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్​గా మారింది.

నయనతార

By

Published : Jul 28, 2019, 9:29 PM IST

అత్యధిక పారితోషికం తీసుకున్న కథానాయికల్లో ఒకరిగా ఉన్న నయనతార.. కథ నచ్చకపోతే సినిమాలు చెయ్యదని మరోసారి నిరూపించింది. ఓ నిర్మాత తన సినిమాలో నటించేందుకు రూ. 10 కోట్లు ఆఫర్ చేయగా నటించడానికి ఒప్పుకోలేదని సమాచారం.

శరవణ్‌ అనే నూతన కథానాయకుడితో ఓ సినిమా తెరకెక్కించేందుకు కోలీవుడ్‌లో ప్రయత్నాలు మొదలయ్యాయట. ఇందులో హీరోయిన్​గా నయనతారను ఎంపిక చేసి ఆమెను సంప్రదించిందట చిత్రబృందం. అంత పెద్ద మొత్తంలో పారితోషకం ఇస్తానన్నా.. కథ నచ్చకపోవడం వల్ల ఆ ఆఫర్‌ను తిరస్కరించిందట నయన్‌. మరి నిజంగానే ఆమెకు కథ నచ్చలేదా? లేక కొత్త హీరో అని నో చెప్పిందా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఇది సంగతి: 'ఆర్​ఆర్ఆర్' షెడ్యూల్ మారిందా...?

ABOUT THE AUTHOR

...view details