తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వెంకటేశ్ చిత్రంలో నవాజుద్దీన్..! - Nawazuddin Siddiqui with venkatesh

బాలీవుడ్  విలక్షణ నటుడు నవాజుద్దీన్ తెలుగు సినిమాల్లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడట. వెంకటేశ్ హీరోగా తరుణ్ భాస్కర్​ దర్శకత్వంలో రాబోయే చిత్రంలో ఓ కీలకపాత్ర కోసం ఈ నటుడిని చిత్రబృందం సంప్రదించినట్లు సమాచారం.

నవాజుద్దీన్

By

Published : Oct 25, 2019, 9:08 AM IST

బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ త్వరలోనే తెలుగులోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్​ నటించిన 'పేట'లో కీలక పాత్ర పోషించాడీ విలక్షణ నటుడు. ఇప్పటివరకు తెలుగు సినిమా మాత్రం చేయలేదు.

వెంకటేశ్ కథానాయకుడిగా 'పెళ్లి చూపులు' దర్శకుడు తరుణ్ భాస్కర్ ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సురేశ్ బాబు నిర్మాతగా వ్యవహిరించనున్నాడట. ఈ చిత్రంలో కీలకపాత్ర కోసం చిత్రంబృందం నవాజుద్దీన్​ను సంప్రదించినట్లు సమాచారం.

ప్రస్తుతం వెంకటేశ్‌ 'వెంకీమామా' సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో వెంకటేశ్‌-నాగచైతన్య మామా అల్లుళ్లుగా కనిపించనున్నారు. రాశీఖన్నా, పాయల్‌ రాజ్‌పుత్‌ కథానాయికలు. కె.ఎస్‌.రవీంద్ర (బాబీ) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇవీ చూడండి.. కమల్ 'భారతీయుడు 2'కు లీకుల బెడద

ABOUT THE AUTHOR

...view details