తొలి చిత్రం 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ'లో కామెడీ డిటెక్టివ్‌గా అందర్నీ మెప్పించి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నవీన్ పొలిశెట్టి. ఇటీవల 'జాతిరత్నాలు'తో(jathi ratnalu naveen polishetty) ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. ఈ క్రమంలో అతడికి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అనుష్కతో ఓ సినిమాతో(anushka naveen polishetty movie) పాటు సితార ఎంటర్టైన్మెంట్(రూ. 4కోట్ల పారితోషికం), యూవీ క్రియేషన్స్ బ్యానర్లో ఓ సినిమాకు ఓకే చేసి అందుకు అడ్వాన్స్ కూడా తీసుకున్నాడని తెలిసింది.
రూ.4కోట్ల రెమ్యునరేషన్ తిరిగిచ్చిన నవీన్ పొలిశెట్టి! - naveen polishetty jatiratnalu
సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో వచ్చిన ఆఫర్‌ను హీరో నవీన్ పొలిశెట్టి వదులుకున్నట్లు తెలుస్తోంది. సినిమా కోసం తీసుకున్న రూ. 4కోట్ల అడ్వాన్స్ కూడా తిరిగి ఇచ్చేశాడట. కారణం ఏంటంటే?
అయితే ఇప్పుడు సితార ఎంటర్టైన్మెంట్స్ ఆఫర్‌ను వదులుకున్నాడట. తీసుకున్న రూ.4కోట్ల పారితోషికం తిరిగి ఇచ్చేశాడని సమాచారం. రంగ్‌దే మూవీ కో డైరెక్టర్ కథ వినిపించగా నవీన్ స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేయాలని సూచించాడట. అయితే మార్పులు చేసినప్పటికీ కథ పూర్తి కాకపోవడం వల్ల ఈ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టి, డబ్బులు వెనక్కి ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు వేచి ఉండాల్సిందే.
ఇదీ చూడండి: దీపిక పేరుతో కిన్వా వ్యాపారం చేశా: నవీన్ పొలిశెట్టి