తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సైకోగా మారబోతున్న నేచురల్‌ స్టార్‌..? - nani, sudeer babu

నాని, సుధీర్​బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం 'వి'. ఈ సినిమాలో నేచురల్ స్టార్​ విలన్​గా కనిపించబోతున్నాడట. ఇది కాస్త సైకోలా ఉండే పాత్రని సమాచారం.

nani
నాని

By

Published : Dec 3, 2019, 10:09 AM IST

ఎప్పుడూ పక్కింటి అబ్బాయిలా నవ్వుతూ నవ్విస్తూ ఉండే నాని ఇప్పుడు సైకోలా మారిపోయాడు. అతనిని పట్టుకోవడానికి సుధీర్‌ బాబు పోలీస్‌గా దిగాడు. మరి నాని సైకోలా ఎందుకు మారాడు? ఈ పోలీస్‌ ఆ సైకోని పట్టుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు, అందులో ఉన్న మలుపులు, ఎత్తుగడలు ఏంటి అనే విషయాలు తెలియాలంటే 'వి' చిత్రం వచ్చేంత వరకు ఆగాల్సిందే.

నాని, సుధీర్​బాబు ప్రధానపాత్రలో నటిస్తోన్న సినిమా 'వి'. నానిని వెండితెరకు పరిచయం చేసిన మోహన క్రిష్ణ ఇంద్రగంటి ఈ చిత్రానికి దర్శకుడు. ఇందులో నాని విలన్‌గా నటిస్తున్నట్లు వార్తలొస్తున్నాయ్‌. అయితే అది హీరోయిజంతో కూడిన విలనిజం అని వినికిడి. ఇందులో నాని విలనే అయినా కథ మొత్తం నేచురల్ స్టార్‌ చూట్టూనే తిరుగుతుందని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు.

నాని కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం ఇది. నివేదా థామస్, అదితి రావ్‌ హైదరి నాయికలు. వచ్చే ఏడాది ఉగాదికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శకనిర్మాతలు.

ఇవీ చూడండి.. 'నేనూ.. అంజ‌లా జ‌వేరి ఇరవ‌య్యేళ్లుగా ప్రేమ‌లో ఉన్నాం'

ABOUT THE AUTHOR

...view details