యువ కథానాయకుడు నాని ఓ నూతన దర్శకుడికి అవకాశం ఇవ్వబోతున్నాడని సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇప్పటికే నానికి ఆ డైరెక్టర్ కథ వినిపించాడని, ఇద్దరి మధ్య చర్చలు సాగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు నాని చేయని జోనర్‌లో సినిమా ఉండబోతుందట.
నూతన దర్శకుడితో నేచురల్ స్టార్..! - natural star nani new movie
నేచురల్ స్టార్ నాని త్వరలోనే కొత్త దర్శకుడితో ఓ సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. 'వి' చిత్ర షూటింగ్ అయ్యాక ఈ మూవీ పట్టాలెక్కే అవకాశముంది.
నాని
ప్రస్తుతం నాని మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో 'వి' అనే చిత్రంలో నటిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ చిత్రం పూర్తైన తర్వాత నూతన దర్శకుడితో చేస్తాడా? అనే ప్రశ్నకు సమాధానం తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
ఇవీ చూడండి.. పిల్లలుంటే ఇలా చేయండని చెబుతోన్న నాని