దక్షిణ భారతదేశంలో అన్ని భాషలలో నటించటంతోపాటు ఒకే ఏడాదిలో 24 సినిమాలలో నటించిన జయసుధను ఘనంగా సత్కరించారు. టి.సుబ్బరామిరెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని చలన చిత్ర రంగంలో 46 ఏళ్లు పూర్తి చేసుకున్న ఆమెను 'అభినయ మయూరి' బిరుదుతో సత్కరించారు. మేనత్త విజయనిర్మల ప్రోత్సాహంతో సినీరంగంలో అడుగుపెట్టిన తనకు మురళీమోహన్, మోహన్‌బాబు, జయప్రద, రాధికలు ఎంతో అండగా ఉన్నారని జయసుధ చెప్పుకొచ్చారు. నటిగా విశాఖలోనే తనకు మొదటి అభిమాన సంఘం ఏర్పడిందన్నారు. అలాంటి చోటే 'అభినయ మయూరి' అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందన్నారు.
సహజ నటి... 'అభినవ మయూరి'
సుబ్బరామిరెడ్డి లలితకళా పరిషత్ ఆధ్వర్యంలో విశాఖ వేదికగా సుబ్బరామిరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని నటి జయసుధను అభినవ మయూరి బిరుదుతో ఘనంగా సత్కరించారు.
సహజ నటి...'అభినవ మయూరి'.. జయసుధ
ఈ సందర్భంగా సర్వధర్మ సమభావన సమ్మేళనం నిర్వహించి, వివిధ పీఠాధిపతులకు సుబ్బరామిరెడ్డి సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.
ఇదీ చదవండిః ముద్దిచ్చి.. ఆపై బిందిచ్చిన పూజా హెగ్డే