'మా' అధ్యక్ష ఎన్నికల్లో తమను గెలిపిస్తే నటీనటులకు నెలకు రూ. 6 వేల పింఛను అందిస్తామని సీనియర్ నటుడు నరేష్ తెలిపారు. 'చిరంజీవి కళ్యాణ లక్ష్మి' పథకం కింద నిరుపేద నటీనటుల కుటుంబాల్లోని పిల్లల పెళ్లికి లక్షా నూట 16 రూపాయలను ఆర్థిక సహాయంగా అందించనున్నట్లు వెల్లడించారు. మార్చి 10న జరగనున్న అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో తమ జట్టు అమలు చేయనున్న మేనిఫెస్టోను విడుదల చేశారు.
"మమ్మల్ని గెలిపించండి" - maa elections
'మా' అధ్యక్ష ఎన్నికల కోసం శివాజీరాజా వర్గం, నరేష్ వర్గాలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. తమను గెలిపిస్తే 6వేల రూపాయల పింఛను ఇస్తామని నరేష్ ప్రకటించారు.
మానిఫెస్టో విడుదల
సోమవారం మెగాస్టార్ ఇంటికి వెళ్లిన నరేష్, జీవిత, రాజశేఖర్లు తమకు మద్దతివ్వాలని కోరారు. దీనిపై చిరంజీవి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.