తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రమాణస్వీకారం రోజే వివాదం.. నరేశ్​పై రాజశేఖర్ ఫైర్! - jeevitha

మా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు నటుడు నరేశ్. ప్రమాణస్వీకారం తీరును హీరో రాజశేఖర్ తప్పుపట్టారు. నేను అని సంబోధించారని మనం అని పిలిస్తే బావుంటుందని సూచించారు. నరేశ్ వైఖరిపై నటి హేమ కూడా మండిపడింది.

నరేశ్ ప్రమాణస్వీకారం

By

Published : Mar 22, 2019, 10:59 PM IST

Updated : Mar 22, 2019, 11:31 PM IST

తెలుగు సినీ నటీనటుల సంఘం నూతన అధ్యక్షుడు నరేశ్ ప్రమాణస్వీకారం చేశారు. నరేశ్ ప్రమాణ స్వీకారం తీరును ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ రాజశేఖర్ తప్పుపట్టారు. నరేశ్​ మాట్లాడిన ప్రతి మాటలో నేను అనే పదం ఉందని, ఎక్కడా మేము అనడం లేదని రాజశేఖర్ అభ్యంతరం తెలిపారు. అంతా ఒక్కటిగానే గెలిచామని అన్నాడు.

నరేశ్ ప్రమాణస్వీకారం

నరేశ్​ పని ఒత్తిడి వల్లే "నేను" అని అన్నారని జీవితరాజశేఖర్ వివాదాన్ని సద్దుమణిగించేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత మైక్ తీసుకొని మాట్లాడబోతున్న హేమను నరేశ్​ వారించారు. ఆమె చేతుల్లోని మైక్ లాక్కున్నారు. దీంతో హేమ 'మా' అసోసియేషన్ గురించి నరేశ్​ చెప్పిన విషయాలన్నీ ఆయన వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయాలేనని, మా కార్యవర్గంలోని 26 మందిని సంప్రదించకుండా ప్రకటన చేశారని మండిపడింది.

Last Updated : Mar 22, 2019, 11:31 PM IST

ABOUT THE AUTHOR

...view details