ఈ ఏడాది ఓటీటీ(ott release movies telugu 2021) వేదికగా చిన్న, పెద్ద హీరోలకు సంబంధించిన ఎన్నో సినిమాలు విడుదలై సినీప్రియులను అలరించాయి. వాటిలో కొన్ని సూపర్‌హిట్‌గా నిలవగా.. మరికొన్ని మిశ్రమ స్పందనను అందుకున్నాయి. ఇంతకీ ఆ చిత్రాలేంటి? అవి ఏ ప్లాట్‌ఫామ్‌పై అందుబాటులో ఉన్నాయో ఓ సారి చూసేద్దాం..
నారప్పను చూసి తీరాలప్ప
కమర్షియల్ సినిమాలకు టాలీవుడ్‌లో కొదవలేదు. సామాజిక అంశానికి కమర్షియల్‌గా చెప్పడంలో 'నారప్ప'(narappa movie ott platform) విజయం సాధించింది. తమిళ చిత్రానికి రీమేక్ అయినప్పటికీ వెంకటేశ్ నటనతో కట్టిపడేశాడు. 'నారప్ప'గా వయసుమీరిన పాత్రలో విశ్వరూపం చూపించాడనే చెప్పాలి. థియేటర్లలో విడుదల కావాల్సిన ఈ సినిమా అనివార్య కారణాల వల్ల ఓటీటీలో విడుదలై విజయం సాధించింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. ప్రియమణి కథానాయిక. అమెజాన్ ప్రైమ్‌లో ఉందీ చిత్రం.
టక్ జగదీశ్
నాని గతేడాది 'వి' అనే యాక్షన్ థ్రిల్లర్‌ను అమెజాన్ ప్రైమ్‌లో డైరెక్ట్‌గా విడుదల చేశాడు. 'టక్ జగదీశ్'ను(Tuckjagadish ott platform) థియేటర్లలో అందించాలనుకున్నారు. కానీ చివరి నిమిషంలో ఓటీటీ బాట పట్టిందీ చిత్రం. స్టైలిష్ లుక్‌తో నాని అదరగొట్టాడు. ప్రస్తుత పండగ వాతావరణానికి ఇది సరైన చిత్రం. సినిమా నిండా కుటుంబ భావోద్వేగాలను పండించాడు దర్శకుడు. మిశ్రమ స్పందన లభించినప్పటికీ కుటుంబ ప్రేక్షకులను మెప్పించింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది!
కితకితల చోరుడు
సినిమా ఏదైనా అందులో ఎంతో కొంత కొత్తదనం ఉండేలా జాగ్రత్తపడతాడు శ్రీవిష్ణు. అలా ఈ ఏడాది థియేటర్లలో విజయం సాధించిన చిత్రం ‘రాజ రాజ చోర’.(rajaraja chora ott platform) మేఘా ఆకాశ్, సునైన హీరోయిన్లుగా చేశారు. కథనంతోనే ఆకట్టుకునే ఈ సినిమాలో వచ్చే కామెడీ సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి. ఇది బుల్లితెర మీద అలరించేందుకు జీ5లో విడుదలైంది.
థ్రిల్లింగ్.. మాస్ట్రో