తెలంగాణ

telangana

ETV Bharat / sitara

డబ్బింగ్​ చెబుతున్న.. 'టక్​ జగదీష్' - నాని కొత్త చిత్రం

నేచురల్​ స్టార్ నాని కొత్త చిత్రం 'టక్​ జగదీష్'​ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. దీంతో డబ్బింగ్​ పనులు ప్రారంభించింది చిత్రబృందం.

nani's tuck jagadish unit has started dubbing work
డబ్బింగ్​ చెప్తున్న.. 'టక్​ జగదీష్'

By

Published : Jan 5, 2021, 8:01 AM IST

వేసవిలో వినోదాలు పంచేందుకు తన 'టక్ జగదీష్' చిత్రాన్ని ముస్తాబు చేస్తున్నారు నేచురల్​ స్టార్ నాని. ఆయన కథానాయకుడిగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇది. రీతూవర్మ, ఐశ్వర్యరాజేష్, కథానాయికలు. సాహు గరపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిత్రీకరణ తుది దశకు చేరుకుంది.

ఈ సినిమా డబ్బింగ్​ కార్యక్రమాలు సోమవారం నుంచి ఆరంభమైనట్లు చిత్రవర్గాలు వెల్లడించాయి. "నాని- శివ నిర్వాణ కలయికలో 'నిన్నుకోరి' తర్వాత రూపొందుతున్న చిత్రమిది. వేసవి ప్రత్యేకంగా ఏప్రిల్​లో విడుదల చేస్తున్నాం. క్రిస్మస్ సందర్భంగా విడుదల చేసిన ఫస్​లుక్​కి మంచి స్పందన లభించింది. ఈ చిత్రం ఇంటిల్లిపాదినీ అలరించేలా ఉంటుంద"ని సినీ వర్గాలు వెల్లడించాయి.

'టక్​ జగదీశ్​'లో జగపతి బాబు, నరేష్, రావు రమేష్, రోహిణి, నాజర్ తదితరులు నటిస్తున్నారు. ఎస్.తమన్ సంగీతం సమకూరుస్తున్నారు.

ఇదీ చూడండి:'అవునూ.. వాళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారు'

ABOUT THE AUTHOR

...view details