తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మూడు నెలల గ్యాప్​తో నాని సందడి - నాని వి సినిమా

నేచురల్ స్టార్ నాని.. మూడు నెలల వ్యత్యాసంతో వరుసగా తన రెండు సినిమాల్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. అవేంటి? వాటి కథేంటంటే?

Nani Upcoming Movies V. Directed by Mohan Krishna Indraganti Release on 25 March and Tuck Jagadish Directed by Siva Nirvana
మూడు నెలల గ్యాప్​తో నాని సందడి

By

Published : Feb 7, 2020, 6:23 AM IST

Updated : Feb 29, 2020, 11:49 AM IST

వైవిధ్యభరిత కథలతో ప్రేక్షకుల్ని మెప్పించే టాలీవుడ్ హీరోల్లో నాని ముందు వరసలో ఉంటాడు. వరుసగా చిత్రాలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరించే నేచురల్ స్టార్.. ఈ ఏడాది మాత్రం వెంటనే వెంటనే అభిమానుల ముందుకు రానున్నాడు. మూడు నెలల వ్యత్యాసంలో రెండు చిత్రాలను థియేటర్లలోకి తీసుకొస్తున్నాడు. అవే 'వి', 'టక్ జగదీష్'.

మూడు నెలల గ్యాప్​తో నాని సందడి

'వి' సినిమాలో ప్రతినాయక లక్షణాలున్న పాత్రలో కనిపించనున్నాడు నాని. సుధీర్​బాబు, నివేదా థామస్, అతిదీరావు హైదరీ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ఉగాది కానుకగా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మూడు నెలల గ్యాప్​తో నాని సందడి

'టక్‌ జగదీష్‌' పేరుతో రూపొంతున్న మరో చిత్రంలో నాని హీరోగా నటిస్తున్నాడు. 'నిన్ను కోరి'తో ఆకట్టుకున్న శివ నిర్వాణ దర్శకుడు. ఈనెల 11 నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ మొదలు కానుంది. జులై 3న థియేటర్లలోకి తీసుకురానున్నారు. ఇలా మూడు నెలల వ్యత్యాసంతో ప్రేక్షకులను అలరించనున్నాడు నాని.

ఇదీ చదవండి: పవన్​.. చిరు.. ప్రభాస్​.. కొత్త సినిమా టైటిల్స్​ ఇవేనా?

Last Updated : Feb 29, 2020, 11:49 AM IST

ABOUT THE AUTHOR

...view details