తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పవన్​కు మద్దతుగా నాని.. ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి

'రిపబ్లిక్'​(republic movie pre release event) సినిమా ప్రీరిలీజ్​ ఈవెంట్​కు ముఖ్య అతిథిగా హాజరైన పవన్​కల్యాణ్​.. చిత్రపరిశ్రమ విషయంలో ఏపీ ప్రభుత్వ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా దీనిపై స్పందించిన హీరో నాని.. పవన్​ వ్యాఖ్యలకు మద్దతుగా నిలిచారు. ఏపీ ప్రభుత్వం ఆలస్యం చేయకుండా చిత్రపరిశ్రమపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.

nani
నాని

By

Published : Sep 26, 2021, 3:57 PM IST

Updated : Sep 26, 2021, 4:57 PM IST

తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై పవన్ కల్యాణ్(republic movie pre release event) చేసిన వ్యాఖ్యాలను యువ నటుడు నాని సమర్థించారు. పవన్ కల్యాణ్ మాటలు నిజాయతీతో కూడుకున్నవని పేర్కొన్న ఆయన... పవన్​తో రాజకీయ విభేదాలను పక్కనపెట్టి చిత్రపరిశ్రమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్​కు విజ్ఞప్తి చేశారు. సినిమా సోదరుడిగా తాను ఈ మాట చెబుతున్నట్లు అన్నారు. ఆలస్యం చేయకుండా సంబంధిత మంత్రితో కలిసి చిత్ర పరిశ్రమపై దృష్టి సారించాలని నాని కోరారు.

పవన్ వ్యాఖ్యలకు మరో యువ హీరో కార్తికేయ కూడా మద్దుతు పలికారు." ఏ పొలిటికల్​ పార్టీకీ మద్దతు పలకట్లేదు. అలా అని వ్యతిరేకం కాదు. కానీ తెలుగు చిత్ర పరిశ్రమ గురించి పవన్​ చేసిన వ్యాఖ్యలు సరైనవి. సినీఇండస్ట్రీ గురంచి ఆయనతో సహా ఎవరూ మాట్లాడిన వారికి మద్దతుగా నిలవడం నా బాధ్యత." అని కార్తికేయ అన్నారు.

పవన్​ ఏమన్నారంటే..

సెప్టెంబరు 25న సాయిధరమ్​ తేజ్(sai dharam tej republic movie) హీరోగా నటించిన 'రిపబ్లిక్'(republic movie pre release event) చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్​కు పవన్​ హాజరయ్యారు. సాయితేజ్​ ఆసుపత్రిలో ఉన్నందు వల్లే ఈ కార్యక్రమానికి హాజరైనట్లు తెలిపారు. ఈ క్రమంలోనే చిత్రపరిశ్రమ విషయంలో ఏపీ ప్రభుత్వ వైఖరిపై పవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పేరు చెప్పి సినిమా పరిశ్రమను ఇబ్బంది పెడుతున్నారని వ్యాఖ్యానించారు.

దోపిడీలు, దొమ్మీలు చేయలేదు...

సినిమా పరిశ్రమకు కులాలు, మతాలు ఉండవని పవన్ కల్యాణ్‌(pawan kalyan fire on ycp govt news) ఉద్ఘాటించారు. సినిమా పరిశ్రమలో అనేక కష్టాలు ఉంటాయని, సినీ పరిశ్రమ జోలికి వస్తే సినీ నటులందరూ ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. వ్యక్తిత్వానికే విలువ ఇస్తానని పవన్‌ స్పష్టం చేశారు. సినిమావాళ్లు దోపిడీలు, దొమ్మీలు చేయడం లేదని, ప్రేక్షకులను అలరిస్తూ కష్టపడుతున్నారన్నారు. తనతో గొడవ ఉంటే తన సినిమాలు ఆపేయాలని, అంతే గానీ మిగతావారి సినిమాల జోలికి రావొద్దని కోరారు. సినిమాలపై ఆధారపడి హైదరాబాద్‌లోనే లక్ష మంది జీవనం కొనసాగిస్తున్నారని చెప్పారు. తమలో ఉన్న అభిప్రాయ భేదాలను శత్రుత్వంగా భావించడం సరికాదని హితవు పలికారు.

ఇదీ చూడండి: PAWAN KALYAN: చిత్ర పరిశ్రమ వైపు కన్నెత్తి చూస్తే కాలిపోతారు.. వైకాపా నేతలకు పవన్ వార్నింగ్

Last Updated : Sep 26, 2021, 4:57 PM IST

ABOUT THE AUTHOR

...view details