టాలీవుడ్లో విభిన్న చిత్రాలు చేస్తూ పేరు తెచ్చుకున్న నటుడు నాని. తాజాగా అతడో దొంగతనం చేశాడు. అందుకు క్షమాపణ కూడా చెప్పుకున్నాడు. ఇంతకీ ఈ గొడవంతా ఏంటి అని అనుకుంటున్నారా. కొడుకు పేరును సినిమాలో తన పాత్ర కోసం ఉపయోగించాడు నాని.
కొడుకు పేరునే దొంగిలించిన తండ్రి..! - jersy movie
'జెర్సీ' సినిమాలో అర్జున్ పాత్రలో కనిపించనున్నాడు హీరో నాని. కొడుకు పేరును తన పాత్రకు ఉపయోగించినందుకు ఫన్నీగా క్షమాపణ చెప్పుకున్నాడు. ఓ ఫొటోను జత చేస్తూ ట్వీట్ చేశాడు.
కొడుకు పేరునే దొంగిలించిన హీరో నాని
నాని ప్రస్తుతం నటించిన సినిమా 'జెర్సీ'. 36 ఏళ్ల క్రికెటర్గా కనిపించనున్నాడీ హీరో. అందులో అతడి పాత్ర పేరు 'అర్జున్'. నిజజీవితంలో నాని కొడుకు పేరు 'అర్జున్'. దీనిపై స్పందించిన ఈ కథానాయకుడు...సారీ రా జున్ను తప్పలేదు అంటూ ట్వీట్ చేస్తూ కుమారుడితో కలిసున్న ఓ ఆసక్తికర ఫొటోను జత చేశాడు. విశేషమేమిటంటే చిత్రంలో హీరో కొడుకు పాత్ర పేరు నాని కావడం.
ఇది చదవండి: 'నన్ను జడ్జ్ చేయంది తెలుగు ప్రేక్షకులే'