నేచురల్ స్టార్ నాని ముఖ్యపాత్రలో నటిస్తోన్న 'గ్యాంగ్ లీడర్' సినిమా ఫస్ట్‌లుక్ విడుదలైంది. సోమవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంలో... నానితోపాటు నలుగురు మహిళలు, ఓ పాప కనిపించారు. అందరూ మేడపై నిల్చుని బైనాక్యులర్స్ పట్టుకుని ఏదో చూస్తున్నారు.
" బామ్మ, వరలక్ష్మి, ప్రియ, స్వాతి, చిన్ను.." అని వారి పాత్రలను ట్విట్టర్ ద్వారా పరిచయం చేశాడీ జెర్సీ హీరో. ఆసక్తికరంగా ఉన్న ఈ ఫస్ట్‌లుక్ అభిమానుల్ని ఆకట్టుకుంది.
'హలో' తర్వాత విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'గ్యాంగ్ లీడర్'. అనిరుధ్ బాణీలు సమకూరుస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రం మొదటి పాటను జులై 18న, టీజర్‌ను జులై 24న విడుదల చేయబోతున్నారు. ఆగస్టు 30న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.