తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నాని కొత్త గెటప్.. అలరిస్తున్న రాక్షసుడు లుక్ - Aditi Rao Hydari sudheer babu

'వి' సినిమాలో నాని ఫస్ట్​లుక్​ను ఈరోజు(మంగళవారం) విడుదల చేశారు. ఇందులో ప్రతినాయక లక్షణాలున్న పాత్రలో కనిపించనున్నాడీ కథానాయకుడు. మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

నాని కొత్త గెటప్.. అలరిస్తున్న రాక్షసుడు లుక్
హీరో నాని

By

Published : Jan 28, 2020, 10:41 AM IST

Updated : Feb 28, 2020, 6:21 AM IST

నేచురల్ స్టార్ నాని కొత్త గెటప్​​తో కనువిందు చేస్తున్నాడు. 'వి' సినిమాలో రాక్షసుడుగా కనిపించనున్నాడు. అతడికి సంబంధించిన ఫస్ట్​లుక్​ను అభిమానులతో పంచుకుంది చిత్రబృందం. చేతిలో కత్తెర పట్టుకుని, సీరియస్ చూస్తున్న నాని లుక్..​ సినిమాపై అంచనాల్ని పెంచుతోంది.

'వి' సినిమాలో నాని లుక్

ఈ చిత్రంలోనే రక్షకుడుగా నటిస్తున్న సుధీర్​బాబు లుక్​ను నిన్న(సోమవారం) విడుదల చేశారు. వీరిద్దరి మధ్య ఉండే పోరాట సన్నివేశాలు తప్పకుండా ప్రేక్షకుల అలరిస్తాయని అంటోంది చిత్రబృందం. ఇందులో హీరోయిన్లుగా నివేదా థామస్, అదితీరావు హైదరీ నటిస్తున్నారు. అమిత్ త్రివేది సంగీతమందిస్తున్నాడు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకుడు. దిల్​రాజు నిర్మాత. మార్చి 25న ఉగాది కానుకగా థియేటర్లలోకి రానుంది.

'వి' సినిమాలో సుధీర్​బాబు లుక
Last Updated : Feb 28, 2020, 6:21 AM IST

ABOUT THE AUTHOR

...view details