నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీనుల కాంబినేషన్లో రానున్న చిత్రం షూటింగ్ షురూ అవుతోంది. నేటి నుంచి రామోజీ ఫిలింసిటీలో పోరాట ఘట్టాలతో చిత్రీకరణ మొదలుపెడుతున్నారు. వీరి కాంబోలో వచ్చి విజయవంతమైన 'సింహా', 'లెజెండ్' చిత్రాల తర్వాత తెరకెక్కుతోన్న మూడో చిత్రం ఇది. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. అంజలితో పాటు మరో కథానాయిక బాలకృష్ణ సరసన సందడి చేయనుంది. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు భిన్న పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. ఒక పాత్రలో అఘోరాగా కనిపిస్తారు. పాత్రల్ని దృష్టిలో ఉంచుకుని ఆయన 25 కిలోలకు పైగా బరువు తగ్గారు. వారణాసి నేపథ్యంలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించబోతున్నారు.
'బాలకృష్ణ-బోయపాటి' కాంబో ఆరంభం.. పోరాటంతోనే! - బాలకృష్ణ కొత్త సినిమా
బాలకృష్ణ- బోయపాటి కాంబినేషన్ ఓ ప్రత్యేక క్రేజ్ సొంతం చేసుకుంది. వీరివురి కాంబోలో వచ్చిన చిత్రం తప్పక హిట్ కొట్టాల్సిందే. తాజాగా బాలయ్య, బోయపాటి శ్రీనుల కలయికలో వస్తున్న చిత్రం షూటింగ్ షురూ అవుతోంది.
nandamuri balakrishna starts first schedule at ramoji film city