తెలంగాణ

telangana

ETV Bharat / sitara

క్యాన్సర్​ చిన్నారులను పలకరించిన బాలయ్య, రష్మిక - balakrishna latest news

హైదరాబాద్‌లోని బసవతారకం ఆస్పత్రిని సినీనటుడు బాలకృష్ణ, నటి రష్మిక కలిసి సందర్శించారు. 'ఇంటర్నేషనల్ చైల్డ్‌హుడ్ క్యాన్సర్ డే' సందర్భంగా వీరిద్దరూ కలిసి బాధిత చిన్నారులతో కాసేపు మాట్లాడారు.

nandamuri balakrishna and rashmika visited basavatarakam cancer hospital and talk with children
క్యాన్సర్​ చిన్నారులతో బాలయ్య-రష్మిక సందడి

By

Published : Feb 15, 2020, 12:42 PM IST

Updated : Mar 1, 2020, 10:03 AM IST

చిన్నారులతో బాలయ్య-రష్మిక సందడి

క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారుల కోసం చిల్డ్రన్ క్యాన్సర్ ఫండ్ ప్రారంభించింది బసవతారకం ఆస్పత్రి. ఈ కార్యక్రమానికి సినీ నటుడు బాలకృష్ణ, నటి రష్మిక హాజరయ్యారు. క్యాన్సర్‌ను జయించిన చిన్నారులు, వారి తల్లిదండ్రులతో కాసేపు వీరిద్దరూ ముచ్చటించారు. ఈ చిల్డ్రన్ క్యాన్సర్ ఫండ్‌కు వైద్యులు ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇచ్చారు. సినిమా ద్వారా సమాజానికి ఉపయోగపడగలమని ఎన్టీఆర్​ చెప్పిన మాటలను వేదికపై గుర్తుచేసుకున్నాడు బాలకృష్ణ.

"యువతే దేశానికి బలం. వారిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. క్యాన్సర్ అనేక రకాలుగా వ్యాప్తి చెందుతోంది. పిల్లలు దేవుడితో సమానం వారు క్యాన్సర్ బారినపడటం బాధాకరం. బసవతారకం తరఫున సేవ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. చిల్డ్రన్ క్యాన్సర్ ఫండ్‌కి దానం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు"

-- బాలకృష్ణ, సినీనటుడు

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కొత్త సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. దర్శకుడు బోయపాటి శీనుతో మూడోసారి పనిచేయనున్నాడు. ఇప్పటికే ఈ కాంబినేషన్​లో 'సింహా', 'లెజెండ్' చిత్రాలు వచ్చాయి. ఈనెల 26 నుంచి చిత్రీకరణ మొదలుకానున్నట్లు సమాచారం.

టాలీవుడ్​ హీరో నితిన్​, రష్మిక కాంబినేషన్​లో 'భీష్మ' సినిమా తెరకెక్కింది. ఇది ఫిబ్రవరి 21న విడుదల కానుంది. ప్రముఖ నటుడు కార్తీ సరసన తమిళ సినిమా 'సుల్తాన్'​లోనూ.. అల్లు అర్జున్​-సుకుమార్​ కాంబోలో రానున్న ఓ చిత్రంలోనూ కథానాయికగా ఈ అందాల భామ ఎంపికైంది.

Last Updated : Mar 1, 2020, 10:03 AM IST

ABOUT THE AUTHOR

...view details