తెలుగు సినిమా కథానాయకుల్లో మహేశ్ బాబుది ప్రత్యేక శైలి. ఆయన సినిమా షూటింగ్ జరుగుతున్నంత సేపు మనసంతా అక్కడే. షూటింగ్ పూర్తయిన తర్వాత ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా నేరుగా ఇంటికే వెళ్తుంటారని సినీ వర్గాలు చెప్పుకుంటాయి. మహేశ్ ఏమాత్రం సమయం దొరికినా తన కుటుంబంతోనే గడుపుతుంటారు. ప్రస్తుతం కరోనా కారణంగా సినిమా షూటింగ్‌లు ఏమీ లేకపోవడం వల్ల ఇంట్లోనే ఉంటూ కుమారుడు గౌతమ్, తనయ సితారతో చిన్నపిల్లాడిగా మారిపోయి వారితో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తున్నారు.
సితారతో కలిసి మహేశ్ చిరునవ్వులు - namrata insta story
మహేశ్‌బాబు, సితారలకు సంబంధించిన ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది నమ్రత. ఇందులో ప్రిన్స్, సితారతో ఆడుకుంటూ కనిపించాడు.
మహేశ్
అలా సితారను మహేశ్ కడుపుబ్బా నవ్వించిన వీడియోను నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టింది. ఆ వీడియోకు తనదైనరీతిలో వ్యాఖ్యను జోడిస్తూ..."ప్రేమ, జీవితం, నవ్వులు ఇవన్నీ కలిసి ఆయనలోని చిన్నపిల్లాడిని తను మాత్రమే బయటకు తీసుకురాగలదు" అంటూ రాసుకొచ్చింది.
మహేశ్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' తర్వాత కొత్త చిత్రాలేవి అధికారికంగా ప్రకటించలేదు. అయితే ప్రముఖ దర్శకుడు పరశురామ్‌తో కలిసి ఓ సినిమా చేయనున్నారని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి.