నటుడు నాగార్జున ఇప్పటికీ నవ'మన్మథుడి'లా నటించి కుర్రకారును మెప్పిస్తూ అలరిస్తుంటాడు. ప్రస్తుతం నాగ్.. సాల్మన్ అనే కొత్త దర్శకుడితో కలిసి ఓ చిత్రం చేస్తున్నాడు. ఇందులో పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నాడట ఈ అక్కినేని హీరో.
హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్లతో నాగ్..! - హాలీవుడ్ యాక్షన్ కొరియాగ్రాఫర్లతో నాగ్..!
అక్కినేని నాగార్జున ప్రస్తుతం సాల్మన్ అనే నూతన దర్శకుడితో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాల కోసం హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్లను సంప్రదించిందట చిత్రబృందం.
నాగ్.
యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందనున్న చిత్ర పోరాటాల కోసం హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్లతో చర్చలు కూడా జరిపారని సమాచారం. నాగార్జున పోలీస్ అధికారిగా గతంలో కొన్ని చిత్రాల్లో నటించి మెప్పించాడు. ఇటీవల 'మన్మథుడు 2'తో బాక్సాఫీస్ వద్ద నిరాశపర్చాడు నాగ్.
ఇవీ చూడండి.. రోహిత్‌కు విశ్రాంతి.. బుమ్రా, ధావన్ పునరాగమనం