తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'బంగార్రాజు' సంక్రాంతికి వస్తాడా..? - tollywood

అక్కినేని నాగార్జున హీరోగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'బంగార్రాజు'. ఈ సినిమా సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం లేదని తెలుస్తోంది.

బంగార్రాజు

By

Published : Jul 10, 2019, 5:16 AM IST

Updated : Jul 10, 2019, 7:20 AM IST

అక్కినేని నాగార్జునకు ఘనవిజయం అందించిన సినిమా 'సోగ్గాడే చిన్నినాయన'. 2015లో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని మెప్పించింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది. ఈ మూవీలో నాగార్జున చేసిన బంగార్రాజు పాత్రకు మంచి స్పందన లభించింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతోంది. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రానికి 'బంగార్రాజు' అనే టైటిల్ ఖరారు చేశారు.

మొదట ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని చిత్రబృందం భావించింది. తాజాగా ఈ పండుగ బరి నుంచి 'బంగార్రాజు' తప్పుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాగ్​.. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో 'మన్మథుడు 2' సినిమా చేస్తున్నాడు. అనంతరం 'బిగ్​బాస్​-3' షోకు హోస్ట్​గా వ్యవహరించనున్నాడు. ఈ కారణంగా అనుకున్న సమయానికి 'బంగార్రాజు' సినిమా సెట్స్​పైకి వెళ్లేలా కనిపించడం లేదు. వచ్చే ఏడాది వేసవికి విడుదలయ్యే అవకాశం ఉంది.

ఇవీ చూడండి.. సల్మాన్ 'భారత్​'కు సాటిలేరు ఎవ్వరూ.!

Last Updated : Jul 10, 2019, 7:20 AM IST

ABOUT THE AUTHOR

...view details