ఈ వారం బిగ్‌బాస్(nagarjuna bigg boss 5) హౌస్‌లో కెప్టెన్సీ టాస్క్ సుదీర్ఘంగా సాగింది. 'సూపర్ హీరోస్ vs సూపర్ విలన్స్' పోటీలో తమ జట్టును గెలిపించుకునేందుకు హౌస్‌మేట్స్ అందరూ బాగా కష్టపడ్డారు. చివరిగా 'మెరుపుశక్తి'ని దక్కించుకుని సూపర్ విలన్స్ జట్టు కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచింది. దీంతో విలన్స్ జట్టు సంబరాల్లో మునిగి తేలింది. ఈక్రమంలో విలన్స్ జట్టులో ఉన్న జెస్సీ(bigboss jaswanth)ని ప్రియాంక(bigboss jaswanth) అభినందించగా అతడేమో ముద్దు పెట్టాడు. దీంతో ప్రియాంక అవాక్కైంది. ఈ విషయం తెలిసి, శ్రీరామ్(sriram), షణ్ముఖ్(bigboss shanmukh), సన్నీ(sunny)లు ప్రియాంకను ఆటపట్టించారు. ఇక హౌస్‌మేట్స్ బట్టలు బయట పడేయటంపై సిరి, షణ్ముఖ్‌ల మధ్య వాగ్వాదం జరిగింది.
నువ్వే నా సిస్టర్.. మానస్
ప్రియాంకను ఉద్దేశించిన మానస్( bigboss Manas) 'నువ్వే నా సిస్టర్' అనే సరికి పింకీ కంగుతింది. పక్కనే ఉన్న కాజల్(kajal)ను చూపిస్తూ ‘ఆమె నీ సోదరి అయి ఉంటుంది. నేను మాత్రం కాదు’ అని చెప్పింది. ‘సిస్టర్’ అని మానస్ పదే పదే ఏడిపించటంతో ‘రాజా రాణి’ స్టైల్‌లో బ్రదర్ అని ఆటపట్టిద్దామనుకున్నా పరువు పోయింది’ అని ప్రియాంక సిగ్గుపడింది. తనని అలా పిలవద్దని మానస్‌ను బతిమలాడుకుంది. ఇదే విషయమై సిరి-పింకీల మధ్య కూడా చర్చ జరిగింది. ‘నిన్ను ఎప్పుడూ బాధ పెట్టను. నాతో మాట్లాడు’ అని మానస్‌ను ప్రియాంక వేడుకుంది. అక్కడే భోజనం చేస్తున్న సన్నీ ‘ఏం జరుగుతోంది అక్కడ’ అని అడగ్గా ‘ప్రేమించుకుంటున్నారు’ అని కాజల్ సమాధానం ఇచ్చింది. మరోవైపు సిరితో ఉండటం అస్సలు ఇష్టం లేదని, అందుకే వచ్చే వారం వెళ్లిపోతానని షణ్ముఖ్ ఆమెతో అన్నాడు.
'చిక్కకు దొరకకు' టాస్క్‌లో అనీ విజేత
ఇక కెప్టెన్సీ పోటీదారుల కోసం 'చిక్కకు దొరకకు' టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. విలన్స్ జట్టు సభ్యులు వెల్‌క్రో జాకెట్ ధరించి మిగిలిన ఇంటి సభ్యులు విసిరే బంతులను తమకు అంటుకోకుండా తప్పించుకోవాల్సి ఉంటుంది. బజర్ మోగే సమయానికి ఎవరికి ఎక్కువ పాయింట్లు ఉన్న బంతులు అంటుకుని ఉంటే వాళ్లు పోటీ నుంచి తప్పుకోవాలి. అలా ఈ టాస్క్‌లో చివరి వరకూ అనీ మాస్టర్ నిలిచి ఇంటి కొత్త కెప్టెన్ అయి, తన చిరకాల కల నెరవేర్చుకుంది..
నువ్వు ఫేక్ ఫ్రెండ్‌వి... సిరి ఏడుపు
'చిక్కకు దొరకకు' టాస్క్‌లో కెప్టెన్ షణ్ముఖ్ తనపై బంతులు విసరడాన్ని సిరి జీర్ణించుకోలేకపోయింది. బెడ్ రూమ్‌లోకి వెళ్లి ఏడుస్తూ, కూర్చొంది. సర్ది చెప్పేందుకు షణ్ముఖ్ ప్రయత్నించగా, ‘నువ్వు ఫేక్ ఫ్రెండ్‌వి.. నా ముందు నుంచి వెళ్లిపో’అంటూ అతడిపై అరిచింది. ఇక తనపై బంతులను ఫ్యాక్షనిస్ట్‌లు బాంబులు వేసినట్లు వేశారనీ సన్నీ సరదాగా మాట్లాడాడు. షణ్ముఖ్ కావాలనే కొట్టాడని రవి కూడా ఆరోపించాడు. ‘నేను ఎవరినీ కావాలని కొట్టలేదు. నా వ్యక్తిగతంగా గేమ్ ఆడా. అలా ఆడకపోతే, గ్రూప్‌గా ఆడుతున్నావ్ అని మీరే అంటారు’ అని షణ్ముఖ్ కౌంటర్ ఇచ్చాడు. ‘ఈ టాస్క్‌లో నువ్వు బాగా ఆడావ్, నిన్ను ఎవరైనా గేమ్ ఆడటం లేదు అని అంటే చెప్పుతీసుకొని కొట్టు’ అని ప్రియాంకకు మానస్ సలహా ఇచ్చాడు. షణ్ముఖ్-సిరిల మధ్యకు అస్సలు పోవద్దని, వాళ్లు తిట్టుకుని, ఆ తర్వాత హగ్ చేసుకుంటారని, మధ్యలో మనం బుక్ అవుతామని సన్నీతో రవి చెప్పుకొచ్చాడు. ఎవరెవరు గ్రూప్‌గా ఆడారన్న దానిపై జెస్సీ-సన్నీ మాట్లాడుకున్నారు. ‘మీరిద్దరూ ఎలాంటి స్నేహితులు’ అని షణ్ముఖ్ అడిగాడని, అందుకే తనకు కోపం వచ్చిందని కాజల్‌తో మానస్ అన్నాడు. అదే కోపం నీపై చూపించానని కాజల్‌తో చెప్పాడు. చివరిగా హౌస్‌లో దీపావళి సంబరాలు జరిగాయి. హౌస్‌మేట్స్ అందరూ ఆట పాటల్లో మునిగి తేలారు.
ఇదీ చూడండి:'ఆయన పట్టుదల, క్రమశిక్షణే నాకు స్ఫూర్తి'