యువ హీరో నాగశౌర్య వరుస చిత్రాలతో బిజీ అవుతున్నాడు. ఇటీవలే 'అశ్వథ్థామ'తో కథానాయకుడిగానే కాక రచయితగానూ మెప్పించాడు. ప్రస్తుతం అవసరాల శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఓ సరికొత్త ప్రేమకథలో నటిస్తున్నాడు. తాజాగా లక్ష్మీ సౌజన్య అనే నూతన దర్శకురాలితో చేయనున్న కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించాడు. ఈ సినిమా గురువారం (నేడు) లాంఛనంగా పూజా కార్యక్రమాలు జరుపుకొంది. దీన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ నిర్మించనున్నారు. విశాల్ చంద్ర శేఖర్ స్వరాలు సమకూరుస్తున్నాడు. ఇందులో శౌర్య సరసన రితూ వర్మ కనిపించనుంది. ఫిబ్రవరి 19 నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభం అవుతుంది.
మరో సరికొత్త ప్రేమకథతో నాగశౌర్య - నాగశౌర్య దర్శకురాలు లక్ష్మీ సౌజన్య
నాగశౌర్య.. కెరీర్ ప్రారంభం నుంచి ఎక్కువ ప్రేమకథల్లోనే కనిపించి అలరించిన యువ కథానాయకుడు. ఇటీవల తన పంథా మార్చి 'అశ్వథ్థామ' అనే పూర్తిస్థాయి యాక్షన్ సినిమాలో నటించాడు. ప్రస్తుతం మరో సరికొత్త ప్రేమకథలో నటించేందుకు సిద్ధమయ్యాడీ హీరో.
సరికొత్త ప్రేమకథతో నాగశౌర్య
ఓ వైవిధ్యమైన ప్రేమ కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రానికి 'మూగ మనసులు' అనే టైటిల్‌ను పరిశీలిస్తోన్నట్లు ఆ మధ్య వార్తలొచ్చాయి. కానీ, చిత్ర బృందం ఇంత వరకు టైటిల్‌పై ఓ నిర్ణయానికి రాలేదని సమాచారం. సినిమాను ఈ ఏడాది ద్వితియార్థంలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
ఇదీ చదవండి:వినూత్నంగా 'ఆకాశం నీ హద్దురా' పాట విడుదల
Last Updated : Mar 1, 2020, 5:48 AM IST