తెలంగాణ

telangana

ETV Bharat / sitara

చైతూ-కమ్ముల సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

నాగ చైతన్య-శేఖర్ కమ్ముల కాంబినేషన్​లో వస్తోన్న సినిమా విడుదల తేదీని ఖరారు చేసింది చిత్రబృందం. వచ్చే ఏడాది ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.

naga chaitanya
చైతూ-కమ్ముల

By

Published : Dec 3, 2019, 12:21 PM IST

యువ కథానాయకుడు అక్కినేని నాగచైతన్య హీరోగా శేఖర్​ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి 'లవ్​ స్టోరీ' అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. అయితే తాజాగా ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం.

వచ్చే వేసవి కాలంలో బాక్సాఫీస్ వద్ద బరిలో దిగేందుకు సిద్ధమయ్యాడు నాగ చైతన్య. తన కొత్త సినిమాను ఉగాది కానుకగా ఏప్రిల్ 2న విడుదల చేస్తున్నట్లు ఖరారు చేసింది చిత్రబృందం. ఇందులో చైతూ సరసన సాయిపల్లవి నటిస్తోంది. నారాయణ దాస్ నారంగ్, రామ్మోహన్​రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇవీ చూడండి.. వినూత్న టైటిల్​తో 'నిన్ను కోరి' టీమ్​ మరోసారి

ABOUT THE AUTHOR

...view details