నాగార్జున కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం ‘సోగ్గాడే చిన్నినాయన’. రెండు పాత్రల్లో అలరించిన నాగార్జున, అభిమానులకు చక్కటి వినోదాన్ని పంచిపెట్టారు. తాజాగా ఈ చిత్రానికి రెండో భాగంగా ‘బంగార్రాజు’ వస్తోంది. తాత పాత్రలో కనిపించనున్నాడు నాగార్జున. అతడికి మనవడిగా నటించే పాత్ర ఈ కథలో కీలకమే. అందులో అఖిల్ లేదా నాగచైతన్య కనిపించనున్నారని సమాచారం.
తాత కాబోతున్న కింగ్ నాగార్జున - akhil akkineni
త్వరలో తెరకెక్కబోయే బంగార్రాజు సినిమా తాత - మనవళ్ల నేపథ్యంలో ఉండనుంది. తాతగా నాగార్జున కనిపించనుండగా, మనవడి పాత్రలో నాగచైతన్య, అఖిల్‌లో ఎవరో ఒకరు నటించే అవకాశముంది.
బంగార్రాజు సినిమాలో తాతగా కనిపించనున్న నాగార్జున..మనవడి పాత్రలో అఖిల్ లేదా నాగచైతన్య
ప్రస్తుతం దర్శకుడు కల్యాణ్ కృష్ణ స్క్రిప్టు పనుల్లో బిజీగా ఉన్నాడు. మరోవైపు ‘మన్మథుడు 2’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు నాగార్జున. ఆ సినిమా పూర్తయిన వెంటనే ‘బంగార్రాజు’ పట్టాలెక్కుతుంది.