తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నవ్వించడంలో నాన్నే నాకు స్ఫూర్తి: రాశీ - రాశీఖన్నా తండ్రి

హాస్యభరిత సన్నివేశాల్లో నటించడం చాలా సులభమని అంటోంది హీరోయిన్​ రాశీ ఖన్నా. ప్రస్తుతం ఆమె మారుతి దర్శకత్వంలో గోపీచంద్​ హీరోగా తెరకెక్కుతోన్న 'పక్కా కమర్షియల్​' చిత్రంలో నాయికగా నటిస్తోంది. ఇందులో హాస్యం పండించేందుకు తాను అంతగా కష్టపడడం లేదని వెల్లడించింది.

My father is my inspiration when it comes to comedy, says Raashi Khanna
నవ్వించడంలో నాన్నే నాకు స్ఫూర్తి: రాశీ

By

Published : Apr 14, 2021, 11:15 AM IST

"కామెడీని పండించడంలో మా నాన్నే నాకు స్ఫూర్తి" అంటోంది యువ నాయిక రాశీ ఖన్నా. ప్రస్తుతం గోపీచంద్‌ హీరోగా మారుతి తెరకెక్కిస్తోన్న 'పక్కా కమర్షియల్‌' చిత్రంలో ఈమె నాయికగా నటిస్తోంది. లాయరు పాత్రలో కడుపుబ్బా నవ్వించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తనకు నవ్వించడం చాలా తేలికైన పని అని, ఏదో పాత్ర కోసం నటించాలని కాకుండా సహజంగానే కామెడీని పండిస్తానని చెప్పుకొచ్చింది.

'పక్కా కమర్షియల్​' షూటింగ్​లో రాశీ ఖన్నా

"అందరూ హాస్యభరిత సన్నివేశాల్లో నటించడం చాలా కష్టం అంటుంటారు. కానీ, నాకు అలా అనిపించదు. కామెడీ సన్నివేశాల్లో నటించేటప్పుడు ఎంతో ఆనందిస్తాను. ఇదంతా మా నాన్న రాజ్‌ ఖన్నా వల్లే సాధ్యమైంది. ఆయన చాలా సరదా వ్యక్తి. ఆయన్ను చూస్తూ నేను అలా ఉండటం అలవాటు చేసుకున్నాను. ఇప్పుడు ఇలా తెరపై నవ్వులు పంచుతున్నానంటే దానికి కారణం నాన్నే అని భావిస్తున్నా".

- రాశీ ఖన్నా, కథానాయిక

'జిల్‌' చిత్రం తర్వాత మరోసారి గోపీచంద్‌- రాశీ జోడీ సందడి చేయనుంది. 'ప్రతిరోజూ పండగే' తర్వాత మారుతి దర్శకత్వంలో రాశీ నటిస్తోన్న రెండో చిత్రమిది. ఆ సినిమాలో ఏంజెల్‌ ఆర్నగా ప్రేక్షకుల్ని అలరించింది. 'పక్కా కమర్షియల్‌'లోనూ అలాంటి నవ్వులు పూయించే పాత్ర పోషిస్తోంది.

ఇదీ చూడండి:సైజ్​ జీరో బ్యూటీ.. లారిస్సా బోనేసి

ABOUT THE AUTHOR

...view details