బాలీవుడ్ యువ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ మరణం బాలీవుడ్‌లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన మరణించి నెలరోజులు గడిచిపోయినా ఆయన మరణంపై చర్చ జరుగుతూనే ఉంది. సుశాంత్ చివరి చిత్రం 'దిల్ బెచారా'. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. సుశాంత్ మృతికి నివాళిగా 'వర్చువల్ ట్రిబ్యూట్ టు సుశాంత్ సింగ్' పేరుతో బుధవారం ఓ సంగీత కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఈ విషయాన్ని రెహమాన్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.
సుశాంత్‌కు వర్చువల్‌గా రెహమాన్ స్వర నివాళి - ar rahman news
దివంగత బాలీవుడ్ హీరో సుశాంత్‌కు నేడు వర్చువల్‌గా నివాళి అర్పించనున్నారు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
సుశాంత్‌కు వర్చువల్‌గా రెహమాన్ స్వర నివాళి
ఈ కార్యక్రమంలో బాలీవుడ్ గాయకులు శ్రేయా ఘోషల్, మోహిత్ చౌహాన్, అర్జిత్ సింగ్, సాషా, జోనితా గాంధి, హృదయ్ గట్టాని, సునిధి చౌహాన్, గీత రచయిత అమితాబ్ భట్టాచార్య పాల్గొననున్నారు.
రెహమాన్ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు 'దిల్ బెచారా' చిత్ర దర్శకుడు ముఖేష్ ఛాబ్రా కృతజ్ఞతలు తెలిపారు. 'దిల్ బెచారా' ఈ నెల 24న డిస్నీ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది.